Share News

KTR: అవినీతి కోసమే HILTP పాలసీ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సీరియస్

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:56 PM

9,292ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

KTR: అవినీతి కోసమే HILTP పాలసీ.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సీరియస్
KTR

హైదరాబాద్, నవంబర్ 25: అవినీతి కోసమే హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ తీసుకువచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అవినీతి స్కీంకు తెర లేపిందని ఆరోపించారు. 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు HILTP పాలసీని తీసుకువచ్చిందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామికవాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను.. ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తోందని మండిపడ్డారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు.


మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటున్నారని.. అప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. అంబానీ సరసన నిలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠిన ఆదేశాలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెర

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 04:14 PM