Telangana Panchayat Election Schedule: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెర
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:15 PM
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ(మంగళవారం) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ(మంగళవారం) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సాయంత్రం 6:15 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మీడియా సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే రూరల్‌లోని 545 మండలాలు, 12733 గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
డిసెంబర్‌లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బంది ఎంపిక, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సాయంత్రం 6:15 గంటలకు ఈసీ విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి...
శాలిబండ అగ్నిప్రమాద ఘటన.. సంచలన విషయాలు బయటపెట్టిన డ్రైవర్
మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కఠిన ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News