GHMC Council: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ రచ్చ
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:14 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందర గోళం నెలకొంది.
హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందర గోళం నెలకొంది. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వందేమాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
ఇరు పార్టీల కార్పొరేటర్లు.. ఈ సమావేశంలో టేబుల్స్ ఎక్కి హంగామా చేశారు. దాంతో మార్షల్స్ రంగంలోకి దిగి.. వారిని బయటకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ రెండు పార్టీల కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు.
మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. మంగళవారం జరుగుతున్న ఈ జీహెచ్ఎంసీ పాలక మండలి తుది సమావేశం. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతోపాటు సిటీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులు మందలింపు.. విద్యార్థి ఆత్మహత్య
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News