KTR Formula E case: ఏ తప్పూ చేయలేదు.. లైడిటెక్టర్ టెస్ట్‌కి రెడీ: కేటీఆర్
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:39 PM
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 21: ఫార్ములా ఈ కారు రేసు కేసులో (KTR Formula E case) ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను (Former Minister KTR) విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తాము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని.. అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఏమీ లేదని రేవంత్‌కు కూడా తెలుసన్నారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేపించి.. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని రాజీనామా చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సాకేంతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్‌పై తీవ్ర ఆరోపణలు..
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని మాజీ మంత్రి ఆరోపించారు. 9,292ఎకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేయబోతున్నారన్నారు. రేవంత్ భూకుంభకోణంపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ కూడా కుంభకోణంలో భాగమని... అందుకే స్పందించడం లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారన్నారు.
పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పేటీఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు క్లాసిక్ ఎగ్జాంపుల్ అని అన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందన్నారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
Read Latest Telangana News And Telugu News