CM Revanth Reddy: నా వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:10 PM
తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు.
ఢిల్లీ, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూ దేవుళ్లపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
ముందు వెనక కట్ చేసి..
తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నారని.. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందన్నారు. హిందూ దేవుళ్లు, హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని కొత్తగా ఎన్నికైన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పినట్లు వివరించారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకుడిగా ఎలా పనిచేయాలో తాను చెప్పినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదాస్పదం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని… పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని అని పోలుస్తూ తాను వ్యాఖ్యానించానని స్పష్టత ఇచ్చారు.
కాగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిన్న(మంగళవారం) దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడిన మాటలను కొంతమంది సోషల్ మీడియాలో వక్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గాంధీ భవన్ వద్ద మోహరించిన పోలీసులు
For More TG News And Telugu News