MP Arvind: బీసీ రిజర్వేషన్లు ఒక పొలిటికల్ డ్రామా.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:58 AM
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్‌లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
నిజామాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు ఒక పొలిటికల్ డ్రామా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(గురువారం) నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీలు అమలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని విమర్శించారు. పావలా వడ్డీకే కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పుకొచ్చారు. కేంద్ర నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరగుతున్నాయని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని విమర్శలు చేశారు. రైల్వే పనులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే పనులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తానని తాను ప్రకటించానని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్వోబీలు పూర్తి చేయాలనేది తన టార్గెట్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..
Read Latest Telangana News And Telugu News