Share News

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:30 AM

బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.

MLA Raja Singh: స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ కీలక అభ్యర్థన
Goshamahal MLA Raja Singh

హైదరాబాద్, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ హై కమాండ్‌‌ను అభ్యర్థించారు. ఇవాళ(గురువారం) ఓ ప్రకటన విడుదల చేశారు రాజాసింగ్. ఈరోజు భారతీయ జనతా పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు తనకు సంబంధించిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.


ఇలాంటి వారికి టికెట్ ఎందుకు ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు. బీజేపీలో ఇలాంటి వాతావరణం పెరుగుతోందని... ఇది పార్టీకి హాని కలిగిస్తోందని హెచ్చరించారు. కమలం పార్టీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు. బీజేపీలో సీనియర్ నాయకులు ఇతర పార్టీలతో రాజీపడే విధానాన్ని వదిలివేసి, పార్టీని బలోపేతం చేయడంలో ముందుకు సాగాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అంత మంచి ఫలితాలు వస్తాయని రాజాసింగ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

పంచాయతీ పోరు.. తొలివిడత నామినేషన్లు పర్వం షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 12:50 PM