-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 19th nov vreddy
-
BREAKING: లిఫ్టులో ఇరుక్కుని బాలుడు మృతి..
ABN , First Publish Date - Nov 19 , 2025 | 07:04 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 19, 2025 21:25 IST
లిఫ్టులో ఇరుక్కుని బాలుడు మృతి..
హైదరాబాద్: అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడెం కీర్తి టవర్స్‌లో విషాదం
లిఫ్టులో ఇరుక్కుని ఊపిరాడక ఐదేళ్ల బాలుడు మృతి..
ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న హర్షవర్ధన్ తల్లి ఐశ్వర్య, తండ్రి నర్సీ నాయుడు..
అపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తల్లిదండ్రులు..
చికిత్స పొందుతూ మృతిచెందిన హర్షవర్ధన్..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మధుర నగర్ పోలీసులు..
పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
-
Nov 19, 2025 20:55 IST
కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన..
ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన..
ఐసీఎంఆర్ ఆమోదం రూ.6.2 కోట్లు మంజూరు..
ఆంధ్ర వైద్య కళాశాలలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు..
కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలు..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి.
-
Nov 19, 2025 20:02 IST
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి: ఈస్ట్ పీఎస్ పరిధిలోని లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
మృతుడు కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు చెందిన కళాశాల లెక్చరర్ సతీష్ కుమార్‌గా గుర్తింపు..
కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన సతీష్.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Nov 19, 2025 20:00 IST
రాపూరు అటవీప్రాంతంలో కూంబింగ్..
తిరుపతి జిల్లా: గూడూరు రాపూరు అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్..
బూదనం ల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలు సీజ్.. ఇద్దరు అరెస్టు.
-
Nov 19, 2025 19:58 IST
మిథున్‌రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా..
విజయవాడ: పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్..
విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.
మిథున్‌రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశం..
మిథున్‌రెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా..
ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.
-
Nov 19, 2025 15:04 IST
సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్..
అమెరికా నుంచి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు తీసుకొచ్చిన అధికారులు
అన్మోల్ బిష్ణోయ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..
NCP నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్ణోయ్..
2024 ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో కూడా వాంటెడ్.
-
Nov 19, 2025 14:29 IST
కమలాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు..
కడప : కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి హెలికాప్టర్లో చేరుకున్న సీఎం చంద్రబాబు..
హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన అధికారులు టీడీపీ నేతలు..
పెండ్లిమర్రి మండలం ఎల్లటూరులో గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు..
ఎరువుల యజమానులు, రైతులతో చర్చించిన సీఎం.
-
Nov 19, 2025 14:23 IST
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మిస్సింగ్..
కోఠి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గర్భిణి మిస్సింగ్
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, కాగజ్ ఘాట్‌కు చెందిన దంపతులు శివకుమార్ స్వప్న..
నిన్న డెలివరీ కోసం కోఠి ప్రసూతి హాస్పిటల్ స్వప్నను తీసుకొచ్చిన భర్త శివ కుమార్..
ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయిన గర్భిణి స్వప్న..
24 గంటల్లో డెలివరీ ఉండగా కనిపించకుండా వెళ్లిపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు.
భర్త శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులు.
-
Nov 19, 2025 14:21 IST
మావోయిస్టులను కోర్టుకు తరలించిన పోలీసులు..
కోర్టుకు.. ఏపీలో అరెస్టయిన మావోయిస్టులు
మావోయిస్టులను విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టుల్లో హాజరుపర్చిన పోలీసులు..
నిన్న వివిధ ప్రాంతాల్లో 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.
-
Nov 19, 2025 13:47 IST
హైదరాబాద్: ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులు
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తున్నాం: రేవంత్‌రెడ్డి
ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం
గత పాలకులు డబుల్ బెడ్రూం ఇస్తామని మోసం చేశారు: రేవంత్
ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం
రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాం
కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం: రేవంత్
మార్చి 8 నాటికి కోటి మంది ఆడబిడ్డలకు చీరల పంపిణీ: రేవంత్
ముందుగా గ్రామాల్లో.. తర్వాత పట్టణాల్లో చీరల పంపిణీ: రేవంత్
-
Nov 19, 2025 13:37 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌కు ప్రభుత్వం అనుమతి
చెవిరెడ్డి కుటుంబం భూముల వివరాలు సేకరించిన సిట్
భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిట్
రూ.63 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారని తేల్చిన సిట్
-
Nov 19, 2025 12:59 IST
ఢిల్లీ కారు పేలుడు ఘటనలో కీలక అంశాలు
ఎర్రకోట దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో..
ఉమర్ మహ్మద్ బాంబు ఏర్పాటుచేసినట్లు గుర్తింపు
దాడికి ముందే పేలుడు స్థలంలో రెక్కీ చేసినట్టు సీసీటీవీల్లో కీలక ఆధారాలు
3 గంటల పాటు కారులోనే బాంబును అమర్చిన నిందితుడు ఉమర్‌నబీ
-
Nov 19, 2025 12:36 IST
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్–3 దగ్గర భద్రత కట్టుదిట్టం
అమెరికా నుంచి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్..
భారత్‌కు తరలింపు నేపథ్యంలో భద్రత పెంపు
NCP నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్ణోయ్
2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో నిందితుడు బిష్ణోయ్
-
Nov 19, 2025 12:28 IST
పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ
సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం: మోదీ
సత్యసాయి భౌతకంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది
-
Nov 19, 2025 11:58 IST
లిక్కర్ స్కాంలో ఏ49 నిందితుడు అనిల్ చోక్రాను..
కస్టడీకి ఇవ్వాలని ACB కోర్టులో సిట్ పిటిషన్
చోక్రాను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్
లిక్కర్ స్కాంలో నిధుల మళ్లించేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటుచేసిన అనిల్ చోక్రా
సిట్ పిటిషన్‌పై విచారణను 21కి వాయిదా వేసిన కోర్టు
-
Nov 19, 2025 11:58 IST
ఢిల్లీ: ట్రైబ్యునల్ సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
పలు నిబంధనలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చెల్లకుండా చేసేందుకు..
కేంద్రం తీసుకున్న చర్యలను ఎండగట్టిన ధర్మాసనం
కోర్టు రద్దు చేసిన నిబంధనలను చిన్న మార్పులతో మళ్లీ తీసుకొచ్చి..
పాత తీర్పులను చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించారని సుప్రీం వ్యాఖ్య
న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తుందంటూ 2021 ట్రైబ్యునల్ రీఫార్మ్ చట్టంలోని..
పలు నిబంధనలను రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
-
Nov 19, 2025 11:06 IST
ఢిల్లీ కారు బాబు పేలుడు కేసు
అల్-ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావెద్‌కు 13 రోజుల కస్టడీ
మనీలాండరింగ్ కేసులో జావెద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్
ట్రస్ట్ పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి..
షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్టు గుర్తించిన ఈడీ
జావెద్ అహ్మద్‌ను కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్
-
Nov 19, 2025 10:31 IST
ఢిల్లీ: కాసేపట్లో JDU శాసనసభాపక్ష సమావేశం
నితీష్‌ను శాసనసభాపక్షనేతగా ఎన్నుకోనున్న JDU ఎమ్మెల్యేలు
మ.3గంటలకు ఎన్డీఏ సమావేశం
రేపు పట్నాలో సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం
-
Nov 19, 2025 10:14 IST
ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ
శ్రీసత్యసాయి బాబా మహా సమాధి దగ్గర మోదీ నివాళులు
కాసేపట్లో హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి శతజయంతి వేడుకలు
-
Nov 19, 2025 10:14 IST
కోనసీమ: రావులపాలెంలో మావోయిస్టు అరెస్ట్
ఎడపాక మం. నెల్లిపాక మాధవిహండాకు చెందిన సరోజ్‌గా గుర్తింపు
ఛత్తీస్‌గఢ్‌లో హిడ్మా అనుచరుడిగా వ్యవహరిస్తున్న సరోజ్
-
Nov 19, 2025 09:49 IST
శ్రీసత్యసాయి: పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
కాసేపట్లో ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ
సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించనున్న మోదీ
-
Nov 19, 2025 09:38 IST
హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో వైరల్
హిడ్మా లేఖ గురించి తమకు తెలియదంటున్న అధికారులు
హిడ్మా పేరుతో వైరల్ అవుతున్న లేఖలోని అంశాలు
లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సోను, సతీష్ అవకాశవాదులు
సోను, సతీష్ మోసం చేసి ఇతర క్యాడర్లను లొంగిపోయేలా చేశారు
పార్టీ లైన్‌ను వక్రీకరించి ప్రజలకు చూపించారు: లేఖలో హిడ్మా
ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలేది లేదు: లేఖలో హిడ్మా
లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్లు పునరాలోచించాలి: లేఖలో హిడ్మా
-
Nov 19, 2025 09:21 IST
కమాండ్ కంట్రోల్ రూమ్ కు 50 మంది మావోయిస్టులు.
భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు , కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించిన పోలీసులు.
కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.
కమాండ్ రూం కి చేరుకున్న 5 జిల్లాల ఎస్పీలు ,రేంజ్ ఐజిలు
మావోయిస్టుల అరెస్టు ఆపరేషన్పై 5 జిల్లాల ఎస్పీలతో కలిసి వివరాలు వెల్లడించనున్న ADG మహేష్ చంద్ర లడహ.
మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్,డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు ,మొబైల్స్,సిమ్ కార్డులు,పెన్ డ్రైవ్లు,విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించిన పోలీసులు.
-
Nov 19, 2025 09:18 IST
అమరావతి: ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్
ఆరుగురు మావోయిస్టులు మృతి
మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉన్నట్టు సమాచారం
ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించిన ఇంటెలిజెన్స్ ADG లడ్డా
-
Nov 19, 2025 09:18 IST
నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు: ADG లడ్డా
6 నుంచి 7 మంది చనిపోయారు: మహేష్ చంద్ర లడ్డా
ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది: మహేష్ చంద్ర లడ్డా
ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం: ADG మహేష్ చంద్ర లడ్డా
-
Nov 19, 2025 08:40 IST
రెండవ రోజు కొనసాగుతున్న ఐటి అధికారుల సోదాలు
పిస్తా హౌస్, షాగౌస్,మెహిఫిల్ లో కొనసాగుతున్న ఐటి అధికారుల సోదాలు..
కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
రాజేంద్ర నగర్ పిస్తా హౌస్ ఓనర్ నివాసం లో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ఐటీ
నేడు బ్యాంకు ఖాతాలను పరిశీలించి, లాకర్లను ఓపెన్ చేయనున్న ఐటీ అధికారులు
షాగౌస్, మేహేఫిల్ సైతం పలు డాక్యుమెంట్లు స్వాధీనం...
రికార్డ్స్ లో ఉన్న ఆదాయం అసలు ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉండడంతో కొనసాగుతున్న ఐటీ రై
-
Nov 19, 2025 08:27 IST
తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ..
చిన్న అప్పన్నను 3వ రోజు ప్రశ్నించనున్న CBI సిట్ బృందం
2 రోజులుగా అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానం చెప్పినట్లు సమాచారం
తనకు సంబంధం లేదని అధికారులతో వాదించిన చిన్న అప్పన్న
అప్పన్న బ్యాంకు ఖాతాలో భారీ ఎత్తున నగదు డిపాజిట్‌పై సిట్ ప్రశ్నలు
నగదు డిపాజిట్ చేసిన వారి వివరాలపై జవాబివ్వని అప్పన్న
కల్తీ నెయ్యి సరపరా చేసిన డెయిరీ సంస్థల డైరెక్టర్లతో..
ఎలా పరిచయం అయిందన్న దానిపై స్పందించని చిన్న అప్పన్న
-
Nov 19, 2025 07:41 IST
ఉ.8 గంటలకు పుట్టపర్తికి ప్రధాని మోదీ
ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ
హిల్‌వ్యూ స్టేడియంలో జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని
రూ.100 నాణెం, స్టాంప్ విడుదల చేయనున్న ప్రధాని మోదీ
-
Nov 19, 2025 07:40 IST
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీలో హైఅలర్ట్
నేడు పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటన
హిడ్మా ఎన్‌కౌంటర్, మావోయిస్టుల అరెస్ట్‌తో ఏపీలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
-
Nov 19, 2025 07:19 IST
నేడు తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ
మధ్యాహ్నం నెక్లెస్ రోడ్‌లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర చీరల పంపిణీ
-
Nov 19, 2025 07:08 IST
నేడు తెలంగాణ భవన్‌లో BRS ముఖ్యకార్యకర్తల సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై చర్చ
పాల్గొననున్న కేటీఆర్, హరీష్‌రావు, తలసాని, ఇన్‌చార్జ్‌లు
-
Nov 19, 2025 07:08 IST
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నేడు వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ
చిన్నఅప్పన్న స్టేట్‌మెంట్ ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించనున్న సిట్
-
Nov 19, 2025 07:08 IST
కడప: మధ్యాహ్నం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటన
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్న సీఎం
పెండ్లిమర్రి ప్రజావేదికలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
చిన్నదాసరిపల్లెలో పంట పొలాలు పరిశీలించనున్న చంద్రబాబు
సా.4గంటలకు కమలాపురం టీడీపీ శ్రేణులతో సీఎం సమీక్ష
రాత్రి సీపీఐ నేత రామకృష్ణ నివాసానికి సీఎం చంద్రబాబు
సీపీఐ రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్న చంద్రబాబు
-
Nov 19, 2025 07:08 IST
లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
వైమానిక దాడుల్లో 11 మంది మృతి, మరో నలుగురికి గాయాలు
ఇజ్రాయెల్ దాడిని ధ్రువీకరించిన లెబనాన్ ఆరోగ్య శాఖ
-
Nov 19, 2025 07:08 IST
బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
రేపు పట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణస్వీకారోత్సవం
నేడు శాసనసభాపక్షనేతగా నితీష్‌ను ఎన్నుకోనున్న JDU ఎమ్మెల్యేలు
స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్న బీజేపీ, JDU
-
Nov 19, 2025 07:04 IST
నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల
కడప జిల్లా చినదాసరిపల్లిలో పాల్గొననున్న చంద్రబాబు
46.86లక్షల రైతులకు రూ.7వేల చొప్పున రూ.3,135కోట్లు సాయం
కేంద్రం రూ.2వేలు, ఏపీ ప్రభుత్వం రూ.5వేలు జమ
-
Nov 19, 2025 07:04 IST
నేడు సౌదీ బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన సౌదీ ప్రభుత్వం
కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలకు సౌదీ అంగీకారం
సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది మృతి