-
-
Home » Mukhyaamshalu » Telangana Andhra Pradesh national and international telugu Viral trending Breaking news 22nd nov vreddy
-
BREAKING: తెలంగాణ డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
ABN , First Publish Date - Nov 22 , 2025 | 06:45 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 22, 2025 20:19 IST
డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణ డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్
-
Nov 22, 2025 17:34 IST
హైదరాబాద్: ముగిసిన ఐ బొమ్మ రవి మూడో రోజు విచారణ
సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో రవిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
విచారణకు సహకరించని ఐ బొమ్మ రవి
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తు లేదు,..
మరిచిపోయా పొంతన లేని సమాధానాలు చెబుతున్న రవి
ఎథికల్ హ్యాకర్లతో హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ చేస్తున్న పోలీసులు
-
Nov 22, 2025 17:34 IST
పొంతన లేని సమాధానాలు
ఐ బొమ్మ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు: క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్
ఎథికల్ హ్యాకర్ల సాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తాం: క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్
నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో సర్వర్ ఐపీలు ఉన్నాయి: క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్
రవి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇతర దేశాలకు వెళ్తాడు
రవి బ్యాంక్ అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నాం: క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్
-
Nov 22, 2025 15:14 IST
తెలంగాణ DGP ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
DGP శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు
లొంగిపోయినవారిలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు
లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు: డీజీపీ
37 మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు
లొంగిపోయినవారిలో కీలక నేత సాంబయ్య అలియాస్ అజాద్
మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం
303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, AK 47లు, SLRలు, భారీగా బుల్లెట్స్ స్వాధీనం
-
Nov 22, 2025 15:08 IST
ఢిల్లీ: భారీ స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు
పాకిస్థాన్ నుంచి డ్రోన్ల సాయంతో..
ఆయుధాలు తరలిస్తున్న ముఠాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
పంజాబ్ సరిహద్దుల నుంచి తరలించిన ఆయుధాలను..
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఇవ్వాలని నిందితుల ప్లాన్
నిందితుల నుంచి 10 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం
-
Nov 22, 2025 15:07 IST
వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశం
సంబంధిత సిబ్బందిపై విచారణ జరిపి చర్యల తీసుకోవాలి: చంద్రబాబు
కాకినాడ GGHలో మృతిచెందిన గర్భిణి కుటుంబానికి సాయం అందించాలని సూచన
భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
-
Nov 22, 2025 11:45 IST
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు
హర్యానాలోని ధయుజ్ గ్రామంలో పోలీసుల సోదాలు
అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీకి సమీపంలోనే ధయుజ్ గ్రామం
దేశవ్యాప్త దాడులకు కుట్రపన్నినట్టు ముజమ్మిల్ అంగీకరించినట్టు సమాచారం
-
Nov 22, 2025 11:42 IST
ఐ బొమ్మ రవి కేసులో రంగంలోకి తెలంగాణ సీఐడీ
ఐ బొమ్మ రవి వివరాలు సేకరించిన సీఐడీ అధికారులు
ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్‌లను ప్రమోట్ చేసిన రవి
ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు
మరింత డేటా కోసం సైబర్ క్రైమ్‌ను సమాచారం కోరిన సీఐడీ
-
Nov 22, 2025 10:05 IST
కేటీఆర్ విచారణ నివేదిక
ఫార్ములా ఈ-రేస్ కేసులో ACB తుది నివేదిక
సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపిన ACB
2024 డిసెంబర్ 19న నమోదైన కేసుపై నివేదిక
A1గా కేటీఆర్, A2గా IAS అరవింద్‌కుమార్, A3గా BLN రెడ్డి
A4గా మల్లేశ్వరరావు, A5గా ఈ రేస్ కంపెనీ FEO
తుది నివేదికలో కీలక అంశాలపై ప్రస్తావించిన ACB
ఈ-రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమన్న ACB
BRSకి రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు అందాయన్న ACB
ట్రైపార్టీ అగ్రిమెంట్‌కి ముందే BRSకి ఈ-బాండ్లు చెల్లించినట్టు ప్రస్తావన
2022 ఏప్రిల్, అక్టోబర్‌లో రెండు విదతలుగా
-
Nov 22, 2025 09:44 IST
నేడు సింగూరు ప్రాజెక్టు పరిశీలించనున్న అధ్యయన కమిటీ
సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి
మరమ్మతుల కోసం ప్రాజెక్టు ఖాళీ చేయాలా వద్దా అనే దానిపై పరిశీలన
డ్యామ్ ఖాళీ చేసి పనులు చేపట్టాలన్న నీటిపారుదల శాఖ అధికారులు
డ్యామ్ ఖాళీ చేస్తే 3 జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయంటున్న అధికారులు
కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలన్న జలమండలి అధికారులు
సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ సింగూరు ప్రాజెక్టు పరిశీలన
-
Nov 22, 2025 09:44 IST
కేటీఆర్ విచారణ నివేదిక
ఫార్ములా ఈ-రేస్ కేసులో ACB తుది నివేదిక
సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపిన ACB
2024 డిసెంబర్ 19న నమోదైన కేసుపై నివేదిక
-
Nov 22, 2025 09:40 IST
హైదరాబాద్: మహిళా అసిస్టెంట్ పైలట్‌పై అత్యాచారం
బెంగళూరులోని ఓ హోటల్లో అత్యాచారం చేసిన ఇద్దరు పైలట్లు
బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
కేసును బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ చేసిన పోలీసులు
-
Nov 22, 2025 08:47 IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్
తెలంగాణ DGP ఎదుట లొంగిపోనున్న పలువురు మావోయిస్టు అగ్రనేతలు
లొంగిపోనున్న కేంద్ర, రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యులు
-
Nov 22, 2025 08:38 IST
ఢిల్లీ పేలుడు కేసులో NIA దర్యాప్తు
NIA కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులు
నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతున్న NIA
తన న్యాయవాదిని కలవడానికి కోర్టు అనుమతి కోరిన డానిష్
డానిష్ దరఖాస్తును విచారించనున్న పటియాలా హౌస్ కోర్టు
ఢిల్లీ ఉగ్రదాడిలో డాక్టర్ ఉమర్‌కు సాయం చేసిన డానిష్
-
Nov 22, 2025 08:38 IST
ఇవాళ రాత్రి పుట్టపర్తికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేపు సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న రేవంత్
-
Nov 22, 2025 08:31 IST
హైదరాబాద్: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్
సతీష్‌ను ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్
పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తానంటూ ఉప్పల సతీష్ మోసాలు
రూ.25కోట్ల మోసం కేసులో సతీష్‌ను ప్రశ్నించనున్న సీసీఎస్ పోలీసులు
గత నెల 23న సతీష్‌ను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ బృందం
రూ.2కోట్లు తీసుకుని సతీష్‌ను తప్పించారనే ఆరోపణలతో ఎస్ఐ శ్రీకాంత్ సస్పెన్షన్
సతీష్ మరోసారి అరెస్ట్, విచారణ తర్వాత రిమాండ్ చేయనున్న పోలీసులు
-
Nov 22, 2025 08:30 IST
నేడు, రేపు పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటన
రాష్ట్రపతితో కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం
మధ్యాహ్నం ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు
సాయంత్రం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవం
స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరుకానున్న సీఎం చంద్రబాబు
రాత్రికి పుట్టపర్తిలోనే బస చేయనున్న సీఎం చంద్రబాబు
రేపు ఉదయం శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు
-
Nov 22, 2025 08:30 IST
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరుకానున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
సాయంత్రం సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
-
Nov 22, 2025 08:29 IST
అమరావతి: సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
కొండవీటి వాగు, గుంటూరు చానెల్, బకింగ్‌హాంకెనాల్స్‌పై నిర్మిస్తున్న వంతెనల పరిశీలన
త్వరితగతిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం
-
Nov 22, 2025 07:12 IST
దక్షిణాఫ్రికాలో భారత సంతతి టెక్ వ్యవస్థాపకులతో మోదీ భేటీ
జొహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్‌తో మోదీ భేటీ
రక్షణ, అణు ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించిన నేతలు
నాస్పర్ చైర్మన్ కూస్ బెక్కర్‌తో మోదీ సమావేశం
భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై మోదీ చర్చ
-
Nov 22, 2025 07:12 IST
యుద్ధం ముగింపునకు అమెరికా ప్రణాళికను స్వాగతించిన రష్యా
శాంతి పరిష్కారానికి యూఎస్ ప్రణాళిక ఆధారమవుతుందన్న పుతిన్
ప్రణాళికపై అమెరికా తమతో చర్చించలేదన్న పుతిన్
ప్రణాళికపై అమెరికాతో విప్లవాత్మక చర్చలు జరుపుతానన్న జెలెన్‌స్కీ
-
Nov 22, 2025 06:45 IST
నేడు పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటన
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో...
రాష్ట్రపతితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Nov 22, 2025 06:45 IST
హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉ.9:30 గంటలకు పుట్టపర్తి వెళ్లనున్న ముర్ము
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనను
-
Nov 22, 2025 06:45 IST
తెలంగాణ: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు
నేడు జిల్లాల వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం
త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు
-
Nov 22, 2025 06:45 IST
డెడికేటెడ్ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై..
డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆమోదించిన కేబినెట్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు
రిజర్వేషన్లపై నేడు జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం
-
Nov 22, 2025 06:45 IST
అమరావతి: ఉపాధ్యాయ సంఘ నేతలతో మంత్రి లోకేష్
ఇకపై టీచర్లకు బోధనేతర బాధ్యతలు ఉండవు: మంత్రి లోకేష్
లెర్నింగ్ అవుట్ కమ్స్ పైనే పూర్తిగా దృష్టిపెట్టండి: మంత్రి లోకేష్
-
Nov 22, 2025 06:45 IST
అమరావతి: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
రాజధాని అమరావతిపై నేడు సమీక్ష
ఉదయం CRDA కార్యాలయంలో కేంద్రమంత్రి పెమ్మసాని,...
మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష
అమరావతి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని నిర్ణయం
రైతుల సమస్యలపై ABN ఆంధ్రజ్యోతిలో డిబేట్
ABN డిబేట్‌లో రైతుల సమస్యలపై గళం విప్పిన రైతు నేతలు
CRDA అధికారులతో ఇవాళ మాట్లాడిన తర్వాత...
రైతులతో భేటీ కావాలని భావిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని
-
Nov 22, 2025 06:45 IST
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన
వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న భట్టి, తుమ్మల
-
Nov 22, 2025 06:45 IST
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఎల్లుండి వాయుగుండంగా బలపడే అవకాశం
నేటి నుంచి దక్షిణకోస్తా, రాయలసీమపై ప్రభావం