Jubilee Hills By-Election: రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు భారీగా జన సమీకరణ
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:09 PM
హైదరాబాద్‌లో ఎన్నికల పండుగ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరో 4రోజులే మిగిలిఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. జనసమీకరణ కోసం ఒక్కో వ్యక్తి రూ.400 నుంచి రూ.500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కింది కథనంలో చదవండి.
పొరుగు సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తల తరలింపు
ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నిక ప్రచారం
నేతలకు ప్రత్యేక ప్యాకేజీలు..
రోడ్ షోలకు రూ.500 చెల్లింపులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills By-Election) ప్రచారంలో ప్రధాన పార్టీలు నిర్వహిస్తున్న రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రోడ్ షో, కార్నర్ మీటింగ్లు విజయవంతం చేసేందుకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. స్థానిక కార్యకర్తలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలను తరలిస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఏ పార్టీ రోడ్లు, కార్నర్ మీటింగ్లు నిర్వహించినా భారీసందడి నెలకొంటోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నిక బాధ్యతలను రాష్ట్రంలోని ముఖ్యనేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. రోడ్ షోలకు జనసమీకరణ చేపట్టే నేతలకు ప్రత్యేక ప్యాకేజీలిస్తున్నారు. వీటికి హాజరయ్యే సాధారణ కార్యకర్తలకు రూ.400 నుంచి రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు. కొంతమంది మహిళా సంఘాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు నేతలు యువజన సంఘాలను ఆశ్రయిస్తూ రోడ్లకు జనాన్ని తీసుకొస్తున్నారు.
జిల్లాల నుంచి భారీగా..
జిల్లాల నుంచి ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఉప ఎన్నిక ప్రచారంలో పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల నుంచి ఆయా పార్టీల ముఖ్యనేతలు పాల్గొంటూ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి మరో 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో స్థానికంగా బస్తీలు, కాలనీల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముఖ్యనేతలు ఓ పక్క ప్రచారం నిర్వహిస్తూనే మరోపక్క బూత్ల వారీగా పార్టీల కేడర్ తో ప్రత్యేక సమావేశాలు చేపడుతున్నారు. తమకు బాధ్యతలు అప్పగించిన బూత్లో భారీగా తమ పార్టీకి ఓటింగ్ పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్