National Herald Case: ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
ABN , Publish Date - Nov 29 , 2025 | 02:38 PM
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీటును విచారణకు స్వీకరించే విషయంలో నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, తదితరులను ఈ కేసులో నిందితులుగా ఈడీ చేర్చింది.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.2,000 కోట్లకు పైగా ఆస్తులను రూ.50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కుంచుకున్నారని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా కుట్ర జరిగిందని, ఈ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి చెరో 38 శాతం వాటాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే, దివంగత మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెంట్, యంగ్ ఇండియన్ అండ్ డొటెక్స్ మర్చంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి..
డీకే, సీఎం సిద్ధరామయ్య టీపార్టీ మీటింగ్.. రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ !
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు.. భారీ సెర్చ్ ఆపరేషన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి