Share News

Kerala Civic polls: 90 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి.. ఎక్కడంటే.?

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:34 PM

మళయాలీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో 90 ఏళ్ల ఓ వృద్ధుడు పోటీలో నిలవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఎవరంటే...

Kerala Civic polls: 90 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలోకి.. ఎక్కడంటే.?
90 Year Old Man Narayanan Nair

ఇంటర్నెట్ డెస్క్: తొమ్మిది పదుల వయసు.. అంటే వృద్ధ్యాప్యం మీదపడి రామా.! కృష్ణా.! అంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి. అయితే.. ఇలాంటి లేటు వయసులోనూ ఎన్నికల బరిలో నిలిచి సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారో ఓ వృద్ధుడు. ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో(Kerala Civic polls) తొంభై ఏళ్ల వయసు గల ఓ వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరాయన? ఆయన బలాబలాలను ఓ సారి పరిశీలిస్తే...


కేరళ స్థానిక ఎన్నికల్లో పోటీలో నిలిచిన ఈయన పేరు నారాయణన్ నాయర్(Narayanan Nair). ఈయనో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఎర్నాకుళం జిల్లాలోని అశమన్నూర్ గ్రామం(Ashamannoor village) రెండో వార్డు తరఫున ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సాధారణ రాజకీయ నేతలకు ఏమాత్రం తగ్గకుండా.. అదే వస్త్రధారణతో వణుకుతున్న స్వరంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి కార్యకర్తలు, మద్దతుదారులతో జోరుగా ప్రచారం సాగిస్తుంటే.. నాయర్ మాత్రం ఎలాంటి పోస్టర్లు లేకుండా ఒంటరిగానే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను కోరుకున్నట్టు తమ వార్డును అభివృద్ధి పరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అంటున్నారు. వయసు దేనికీ అడ్డుకాదంటున్న నాయర్.. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తాననే ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో నాయర్‌కు 'కెటిల్(Kettle)' గుర్తును కేటాయించారు అక్కడి ఎన్నికల అధికారులు.

కేరళలో.. డిసెంబర్ 9, 11న రెండు విడతల్లో స్థానిక ఎన్నికలకు పోలింగ్ జరగనుంది(Kerala Local body polls will be held on December 9 and 11). అదే నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.


ఇవీ చదవండి:

‘దిత్వా’ ఎఫెక్ట్.. రెండు రోజుల భారీ వర్షసూచన

జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?

Updated Date - Nov 29 , 2025 | 01:34 PM