Share News

Power Sharing: సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రెండో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:35 AM

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మిగతా పదవీకాలం రెండున్నరేళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగగా, ఇవాళ..

Power Sharing: సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రెండో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
Karnataka Power Sharing

బెంగళూరు, డిసెంబర్ 2: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఈ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. నవంబర్ 29వ తేదీన ఇరువురి నాయకుల మధ్య మొదటి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి డీకేను సిద్ధరామయ్య తన నివాసానికి ఆహ్వానించగా.. ఇవాళ సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్ తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కోసం పిలిచారు.


వీరిరువురి మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.

ఇలా ఉండగా, 2023లో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు రాష్ట్రానికి సీఎం కావాలన్న ప్రశ్న ఉదయించింది. అయితే, అధిష్టానం సూచన మేరకు ఇరువురు నేతలు రొటేషనల్ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా వ్యవహరించలన్న ఒప్పందం జరిగింది. దీంతో సిద్ధరామయ్య CMగా.. శివకుమార్ డిప్యూటీగా నియమితులయ్యారు. ఇప్పుడు, ఆయా కాలం పూర్తయ్యే సమయంలో ఈ ఒప్పందం మళ్లీ తెరమీదకి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 09:35 AM