CM Siddaramaiah: కొత్త టోపీలు సూచించింది నేనే..
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:07 PM
రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్‌ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్ క్యాప్‌ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
- ఇండియా జస్టిస్ నివేదికలో కర్ణాటక పోలీస్ నంబర్ వన్‌గా ఉందని ప్రశంసలు
బెంగళూరు: రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్‌ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్ క్యాప్‌ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1956 నుంచి స్లోచ్ క్యాప్‌లను వాడుతున్నారన్నారు. 70ఏళ్లుగా ఉన్న విధానంలో మార్పు తీసుకొచ్చామన్నారు. అధికారులు, పోలీసులు ఒకే విధమైన క్యాప్ ధరించడం సంతోషంగా ఉందని చెప్పారు.
రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనేది తన ఆశయమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇది ప్రతి పోలీసు లక్ష్యం కావాలని సూచించారు. ఇండియా జస్టిస్ నివేదికలో కర్ణాటక పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారన్నారు. మంగళూరులో మతఘర్షణలు, నైతిక పోలీస్ గిరి వంటివాటిని నియంత్రణలోకి తీసుకొచ్చామని ఇదే విధానం కొనసాగించాలని తెలిపారు.

కొందరు పోలీసులు రియల్టర్‌లుగాను, డ్రగ్స్ పెడ్లర్‌లతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయని ఇది సరికాదని సీఎం హితవుపలికారు. డ్రగ్స్ విక్రేతలను కాకుండా.. దాని మూలాలను గుర్తించాలని సూచించారు. పోలీసుశాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్, చీఫ్ సెక్రటరీ శాలిని రజనీశ్, డీజీపీ ఎంఏ సలీం సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News