Bengaluru News: ప్రతిపక్ష నేత ఆశోక్ సంచలన కామెంట్స్.. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే సీఎం..
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:37 PM
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
- ఆ కుర్చీ గొడవలో ముందుకు సాగని క్రస్ట్‌గేట్ల పనులు
- ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్
బళ్లారి(కర్ణాటక): తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల ప్రతిపాదన రాజకీయ కుర్చీ పోరులో ఇరుక్కుపోయిందని కర్ణాటక ప్రతిపక్షనేత ఆర్.అశోక్(V. Ashok) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేక క్రస్ట్‌గేట్ల పనులు నిలిచిపోతున్నాయని అన్నారు. బుధవారం ఆనకట్ట వద్ద జరగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పనులపై అయన ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 33 గేట్లలో ఇప్పటివరకు 16 మాత్రమే వచ్చాయన్నారు. ఈ నెమ్మదితో వచ్చే వర్షాకాలానికి గేట్లు అమర్చేలా కనిపించడంలేదు అన్నారు.
ఈ పనులకు జలవనరుల శాఖకు కూడా నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెంటనే డ్యాం వద్దకు వచ్చి పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కీచులాటల్లో పనులు జరుగుతాయనే నమ్మకం కలగడం లేదని అన్నారు. ముందుగా పార్టీ సమావేశంలో అశోక్ మాట్లాడుతూ రెండో పంటకు రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వక రైతలను కష్టాల్లోకి నెట్టిందని, ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

పేరుకు మాత్రమే సీఎం: ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకు మాత్రమే సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారని, అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించాయని విరుచుకుపడ్డారు. బీజేపీ పోరాటం కారణంగా ఒక కళంకిత మంత్రి రాజీనామా చేశాడని, 14 నివేశనాలు రద్దు అయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ పోరాటం మరింత ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఈశాన్య అధ్యాపక నియోజకవర్గాన్ని బీజేపీ వరుసగా గెలుచుకుంటూ వస్తోందని ఈసారి కూడా దానిని కాపొడుకునేందుకు తగిన అభ్యర్థిని ఎంపిక చేసి నివేదిక ఇవ్వనున్నామని అశోక్ వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నళిన్‌కుమార్, ఎమ్మెల్యే ఒగొడ్డణ్ణగౌడ్, ఎమ్మెల్సీ రవికుమార్, ఎమ్మెల్యే కృష్ణనాయక్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News