Home » Tungabhadra
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్‌గేట్లకు పరిమితం చేశారు.
తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్ కార్యాలయం కేశ్వన్ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, హెచ్‌ఎల్‌సీ ఈఈ చంద్రశేఖర్, డ్యాం స్వీచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు.
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో 8 క్రస్ట్‌గేట్లు క్రిందకు దించి కేవలం 13క్రస్ట్‌గేట్ల గుండా మాత్రమే దిగువకు వరద నీరు విడుల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.
తుంగభద్ర పైభాగం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంలో గురువారం సాయంత్రం 3 గంటలకు 78.01 టీఎంసీలు నీరు చేరింది.
తుంగభద్ర జలాశయం నుంచి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.100 టీఎంసీలకు చేరాయి.
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్‌గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.