Share News

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:47 PM

తుంగభద్ర డ్యామ్‌కు పోలీసులు పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక... పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. సాయుధ పోలీసు బలగాలు ప్రాజెక్టు పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు పటిష్ట భద్రత..

- విజయనగర, కొప్పళ జిల్లాల్లో విస్తృత తనిఖీలు

బళ్లారి(బెంగళూరు): ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో విజయనగర జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పేలుడు జరిగిన రాత్రి నుంచే పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హొసపేట పట్టణంలో లాడ్జిలు, హోంస్టేలో నివాసం ఉంటున్న వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. రైల్వే పోలీసు స్టేషన్‌, బస్టాండు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు.


pandu2.2.jpg

ఇదే సందర్భంలోనే రైతుల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Dam) గట్టిభద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఎస్‌.జాహ్నవి డ్యామ్‌ వద్దకు చేరకుని శ్వానదళాలతో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉన్న పారంతాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్లు ఎస్పీ మీడియాకు వివరించారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన హంపిలో కూడా పోలీసులు తనిఖీలు కొనసాగాయి.


pandu2.3.jpg

కొప్పళ్‌ నగరంలోని బస్టాండులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బిహార్‌(Bihar)కు చెందిన యువకులకు చెందిన బ్యాంకులు, వారు తెచ్చుకున్న వస్తువులపై శ్వానదళాలతో పరీక్షించారు. అందరి బ్యాగుల్లోనూ ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్‌ ప్యాకెట్లు ఉండడంతో వాటిని గాంజా కలిగిన ప్యాకెట్లుగా భావించి వారిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. భయపడిన యువకులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం వారి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో గాంజా కాదని, పొగాకు ఉత్పత్తులుగా గుర్తించినట్లు ఎస్పీ రామ్‌ ఎల్‌.అరసిద్ది మీడియాకు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 01:47 PM