Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..
ABN , Publish Date - Apr 25 , 2025 | 08:57 AM
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.

హైదరాబాద్ : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) ఓట్ల లెక్కింపు (Counting) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌లో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), ఎంఐఎం (MIM) కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియె సభ్యులు పాల్గొన్నారు. ఓటింగ్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. కాగా గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉంది. మరోవైపు క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాగా పోలింగ్‌లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందినవారు విజేతగా నిలుస్తారని చెప్పారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు.
Also Read..: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..
పార్టీ ల బలాబలాలు
ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 50..
బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..
కాంగ్రెస్‌కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 14..
బీఆర్ఎస్‌కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..
కాగా సరిపడ సంఖ్య బలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీజేపీ నిలిచింది. గత ఇరవై రెండేళ్లుగా హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా అవుతున్నాయి. ఈసారి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ హైకమిషన్‌లోకి కేక్
పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు
For More AP News and Telugu News