Home » GHMC
ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ఉదయం టిఫిన్ వడ్డించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా పని చేస్తున్న కె.రవి కుమార్ శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఒక్క వాన.. నగరంలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ డొల్లతనమే కాదు.. ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్నీ బహిర్గతం చేసింది. కుంభవృష్టితో మహానగర పౌరులు అవస్థలు పడుతున్నా.. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ జామ్తో తిప్పలు పడినా పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడక్కడా మినహా అత్యవసర బృందాలు కనిపించలేదు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది.
జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించాలనే అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. యూట్యూబ్ చానళ్లు, డిజిటల్ పేపర్ల జర్నలిస్టులమని కార్యాలయానికి వస్తోన్న కొందరు అధికారుల విధినిర్వహణకు భంగం కలిగించడంతో పాటు.. బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారని పలువురు సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు.
ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.
భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.
ప్రజల భద్రత విషయంలో జీహెచ్ఎంసీ(GHMC) అధికారుల నిర్లక్ష్యాన్ని పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. కాలానుగుణంగా తనిఖీలు, రక్షణా చర్యలు చేపట్టకపోవడం పౌరులకు ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదముందని పేర్కొంటూ ఆ శాఖ కార్యదర్శి ఇలంబరిది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.