GHMC: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 29 , 2025 | 07:29 PM
భాగ్యనగరంలో తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఆదివారం నుంచి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభించనుంది జీహెచ్ఎంసీ.
హైదరాబాద్, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో తొలిసారిగా ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ (Automated Smart Rotary Parking) అందుబాటులోకి రానుంది. రేపటి(ఆదివారం) నుంచి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద ప్రారంభించనుంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే మల్టీ లెవెల్ పార్కింగ్‌కు ట్రయల్ రన్ పూర్తి చేసింది. నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్. ఉదయం, సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల్లోని స్థానికులు వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది నవ నిర్మాణ్ అసోసియేట్స్. ఒకేసారి 72 కార్లు పార్కింగ్ చేసే సదుపాయం ఉంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ మోడల్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్‌ను నిర్వహించనుంది నవ నిర్మాణ అసోసియేట్. ముందగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకుగానూ నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్‌ను తీసుకురానుంది నవ నిర్మాణ అసోసియేట్.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News