Share News

Hyderabad: తాగునీటితో కారు కడిగిన వ్యక్తి.. రూ.10వేల జరిమానా

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:44 AM

తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్‌లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.

Hyderabad: తాగునీటితో కారు కడిగిన వ్యక్తి.. రూ.10వేల జరిమానా

హైదరాబాద్‌ సిటీ: జలమండలి సరఫరా చేసే తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ సంఘటన బంజారాహిల్స్‌(Banjara Hills)లో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి బంజారాహిల్స్‌ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్‌ నంబర్‌-12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేస్తున్న నీటితో కారు కడుగుతూ కనిపించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎండీ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


city1.2.jpg

తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం ఏమిటని నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడికి నోటీసు అందించి, జరిమానా విధించాలని సంబంధిత మేనేజర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు సదరు వ్యక్తికి రూ.10వేల జరిమానా విధించారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 07:57 AM