Share News

Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..

ABN , Publish Date - Apr 30 , 2025 | 09:09 PM

ఓ దొంగ మొబైల్ షాపులో రీచార్జ్ చేయించుకోవడానికి వస్తాడు. మొదట రూ.19లు.. ఆ తర్వాత రూ.29లు రీచార్జ్ చేయించుకున్న ఆ దొంగ.. దుకాణ యజమానికి డబ్బులు ఇచ్చి, ఏదో మాట్లాడుతుంటాడు. చివరకు ఎలా దోపిడీ చేశాడో మీరే చూడండి..

Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..

రోజురోజుకూ దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా దొంగలు అంతే తెలివిగా చోరీ చేస్తున్నారు. కొందరైతే పట్టపగలు మహిళ మెడల్లో చైన్లు లాక్కుని పోవడం, దుకాణాల్లో దోపిడీలకు పాల్పడడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ మొబైల్ షాపులో రీచార్జ్ చేసుకుని, చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ ప్రాంతంలోని అంబేద్కర్ చౌక్‌లోని ఓ మొబైల్ షాపులో (Mobile shop) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ మొబైల్ షాపులో (Thief in mobile shop) రీచార్జ్ చేయించుకోవడానికి వస్తాడు. మొదట రూ.19లు.. ఆ తర్వాత రూ.29లు రీచార్జ్ చేయించుకున్న ఆ దొంగ.. దుకాణ యజమానికి డబ్బులు ఇచ్చి, ఏదో మాట్లాడుతుంటాడు.

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


దుకాణంలోని క్యాష్ కౌంటర్‌ను తెరచిన యజమాని.. దొంగతో మాట్లాడుతూ లోపల నగదు చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో దొంగ తన జేబులో నుంచి కారం పొడి (chili powder) బయటికి తీసి, అతడి కళ్లలో కొడతాడు. కళ్లలో కారం పడగానే దుకాణ యజమాని కళ్లతో తుడుచుకుంటాడు. ఇంతలో దొంగ క్యాష్ కౌంటర్‌లోని రూ.50వేల నగదు తీసుకుని పారిపోతాడు. అయితే కళ్లల్లో కారం కొట్టినా కూడా ఆ దుకాణ యజమాని, దొంగను పట్టుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. అతడి వెంటే చాలా దూరం వరకూ పరుగులు తీస్తాడు. అయినా దొంగను పట్టుకోలేకపోతాడు.

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..


బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగ ఎంతో తెలివిగా దోపిడీ చేశాడు’’.. అంటూ కొందరు, ‘‘రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 46 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 09:09 PM