Share News

Funny Viral Video: అరే.. ఇలా జరిగిందేంటీ.. ఇది ఫ్యానా లేక డ్రోనా..

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:08 PM

ఓ వ్యక్తి గదిలో టేబుల్ ఫ్యాన్ ముందు కూర్చుని ఏదో పని చేసుకుంటుంటాడు. ఇంతలో గాలి కోసం ఫ్యాన్ ఆన్ చేస్తాడు. అయితే ఆన్ చేసినా ఫ్యాన్ తిరగకపోవడంతో తన చెప్పుతో ఫ్యాన్ రెక్కలపై కొడతాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Funny Viral Video: అరే.. ఇలా జరిగిందేంటీ.. ఇది ఫ్యానా లేక డ్రోనా..

కొన్నిసార్లు సినిమాల్లో కనిపించే తమషా సంఘటనలన్నీ మన కళ్ల ముందే జరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫ్యాన్‌ను చేత్తో కొట్టగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది ఫ్యానా లేక డ్రోనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గదిలో టేబుల్ ఫ్యాన్ ముందు కూర్చుని ఏదో పని చేసుకుంటుంటాడు. ఇంతలో గాలి కోసం ఫ్యాన్ ఆన్ చేస్తాడు. అయితే ఆన్ చేసినా ఫ్యాన్ తిరగకపోవడంతో తన చెప్పుతో ఫ్యాన్ రెక్కలపై కొడతాడు. దీంతో ఫ్యాన్ గిర్రున తిరుగుతుంది.

Woman Viral Video: ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే.. ఐరన్ బాక్స్‌ను ఎలా వాడేసిందో చూడండి..


ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. గిరగిరా తిరిగిన ఫ్యాన్.. అంతటితో ఆగకుండా డ్రోన్ తరహాలో గాల్లోకి లేచింది. చూస్తుండగానే ఆ ఫ్యాన్ గిర్రున తిరుగుతూ (table fan circling in air like drone) గాల్లో అటూ, ఇటూ తిరుగుతూ చివరకు ఎటో వెళ్లిపోయింది. ఇలా ఫ్యాన్ డ్రోన్‌లా మారి ఆ వ్యక్తికి వింత షాక్ ఇచ్చిందన్నమాట.

Drunken Youth Funny Video: వీళ్ల కక్కుర్తి తగలెయ్య.. పార్టీలో ఈ మందుబాబుల ఘనకార్యం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చెప్పుతో కొట్టినందుకు అలిగి వెళ్లిపోయిన ఫ్యాన్’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఫ్యాన్‌కు ఆత్మాభిమానం ఎక్కువే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 13.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 04:08 PM