Chain Snatching Viral Video: ఇలాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త.. చోరీ ఎలా చేశారో చూడండి..
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:48 PM
ఇద్దరు యువకులు రోడ్డు పక్కన బైకు ఆపుకోని ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు పక్కకు చూస్తుంటారు. ఇంతలో ఎదురుగా ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వస్తుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. మన మధ్యలోనే ఉంటూ చివరకు అందరి కళ్లు గప్పి చోరీలకు పాల్పడుతుంటారు. మరికొందరు మంచివారిగా నటిస్తూ అనుమానం రాకుండా చోరీ చేస్తుంటారు. ఇటీవల మహిళ మెడల్లో అత్యంత తెలివిగా చైన్లు లాక్కెళ్లిపోయేవారిని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు మహిళ మెడలో చైన్ లాక్కొని పోయిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి దొంగలు కూడా ఉంటారు జాగ్రత్త’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రోడ్డు పక్కన బైకు ఆపుకోని ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు పక్కకు చూస్తుంటారు. ఇంతలో ఎదురుగా ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వస్తుంటారు.
Accident Viral Video: కొన్నిసార్లు ఇలాక్కూడా జరగొచ్చు.. ఈ బైకర్‌కు ఏమైందో చూడండి..
వారిలో ఓ మహిళ మెడలో మంగళసూత్రాన్ని గమనించిన దొంగలు అలెర్ట్ అవుతారు. ఆ మహిళలు తీరా దగ్గరికి రాగానే.. ముందుకు కదులుతారు. ఇంతలో వెనుక కూర్చొన్న వ్యక్తి మెడలోని (youth steal the mangalsutra from woman's neck) 2 తులాల మంగళసూత్రాన్ని లాక్కుంటాడు. వాళ్లు తేరుకునేలోపే ఆ ఇద్దరు దొంగలు.. బైకుపై అక్కడి నుంచి ఉడాయిస్తారు. చైన్ లాక్కోవడంతో షాకైన మహిళలు.. గట్టిగా కేకలు వేస్తూ వారిని వెంబడించే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే వారు వేగంగా వెళ్లిపోతారు.
ఇలా ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో తెలివిగా చైన్ లాక్కెళ్లిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ దొంగలు చాలా తెలివిమీరిపోయారు’’.. అంటూ కొందరు, ‘‘బయటికి వెళ్లే సమయంలో బంగారు చైన్లు వేసుకోకపోవడమే బెటర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 1100కి పైగా లైక్ చేయగా.. లక్ష మందికి పైగా వీక్షించారు.
Cooking Viral Video: మెదడుకు పని చెప్పడమంటే ఇదే.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..