Accident Viral Video: కొన్నిసార్లు ఇలాక్కూడా జరగొచ్చు.. ఈ బైకర్‌కు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:59 PM
ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు .. బైకర్‌ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

ప్రమాదాలు జరిగే తీరు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొందరు ఎలాంటి తప్పు చేయకున్నా ఊహించని ప్రమాదాల్లో చిక్కకుంటుంటారు. ఇంకొందరు తమ లేకున్నా చివరకు ప్రాణాలే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘బైకర్ తప్పు లేకున్నా ఇలా జరిగిందేంటీ..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు (Truck).. బైకర్‌ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ట్రక్కుపై ఉన్న పెద్ద ఇనుప రేకు పక్కకు జరిగి.. చివరకు బైకర్ తలను బలంగా తాకుతుంది. ఈ ప్రమాదంలో బైకర్ హెల్మెట్ ఎగిరి కిందపడిపోతుంది. అలాగే తలకు బలమైన గాయమవడంతో అతను ఆ మరుక్షణమే (Biker falls after being hit by iron sheet) రోడ్డు పక్కన పడిపోతాడు. అయితే ఈ ప్రమాదంలో అతడి హెల్మెట్ మాత్రమే కిందపడిందా.. లేక అతడి తల కూడా కట్ అయిందా.. అనే విషయం తెలియరాలేదు. అలాగే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది.
Cooking Viral Video: మెదడుకు పని చెప్పడమంటే ఇదే.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేము.. అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 8 వేల మందికి పైగా లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..