Marriage Funny Video: బలవంతంగా డాన్స్ చేయించాలని చూశాడు.. చివరకు వధువు నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:13 PM
ఓ వివాహ కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

మామూలుగానే పెళ్లిళ్లు అంటే వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఆ వినోదం డోస్ డబుల్, త్రిబుల్ అవుతోంది. కొందరు కావాలనే ప్లాన్ చేసి మరీ ప్రాంక్‌లు చేస్తుంటే.. మరికొన్నిసార్లు వధూవరుల మధ్య ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చివరకు ఇవన్నీ కలిసి నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధువుతో బలవంతంగా డాన్స్ చేయించాలని చూసిన వరుడికి చివరికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు.
అయితే ఆమె ముందు డాన్స్ చేసేందుకు సిగ్గుపడుతుంది. దీంతో వరుడు పదే పదే ఆమెను.. డాన్స్ చేయమంటూ ఎంకరేజ్ చేస్తాడు. దీంతో చివరకు వధువు తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీస్తుంది. పాటలో లీనమైన ఆమె.. వివిధ రకాల భంగిమల్లో ఇరగదీస్తుంది. ఇది చూసి వరుడు (Groom shocked to see bride dancing) ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అయినా ఆమె మాత్రం ఏమాత్రం తగ్గకుండా కింద కూర్చుని మరీ వివిధ రకాల స్టెప్పులు వేస్తుంటుంది. చివరకు అలాగే నిలబడి చూస్తున్న వరుడిని కూడా తన వైపు లాగుతూ డాన్స్ చేయాలని బలవంతం చేస్తుంది. దీంతో షాకైన వరుడు.. చివరకు తన తలపై ఉన్న టోపీ అక్కడ పడేసి పారిపోతాడు.
Train Accident Video: నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కోవడంతో..
ఇలా డాన్స్ చేయలేదనుకున్న వధువు.. చిత్రవిచిత్రంగా డాన్స్ చేసి, వరుడుని షాక్‌కు గురి చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి షాక్ ఇచ్చిన వధువు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Cooking Viral Video: మెదడుకు పని చెప్పడమంటే ఇదే.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..