Cooking Viral Video: మెదడుకు పని చెప్పడమంటే ఇదే.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:43 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని మీకు డౌట్ రావొచ్చు. అయితే అతను వంట చేసే పద్ధతి చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు వంట చేయడంలో చిత్రవిచిత్ర పద్ధతులను పాటించడం చూస్తుంటాం. గరిట వేగంగా తిప్పుతూ వంట చేసే వారు కొందరైతే.. మరికొందరు వింత వింత రెసిపీలతో విచిత్రమైన వంటలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి వంట చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మెదడుకు పని చెప్పడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని మీకు డౌట్ రావొచ్చు. అయితే అతను వంట చేసే పద్ధతి చూసి అంతా అవాక్కవుతున్నారు.
సాధారణంగా ఎవరైనా ఒక పెనంలో ఒకే వంట చేస్తారు. కానీ ఇతను మాత్రం ఒక పాత్రలో రెండు రకాల (Man cooking two dishes in one bowl) వంట చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అవనసరంగా గ్యాస్ ఖర్చు ఎందుకు అనుకున్నాడో ఏమో గానీ.. స్టవ్‌పై పాత్ర పెట్టిన అతను.. అందులో సగ భాగంలో కూర చేస్తున్నాడు. అలాగే మరో సగ భాగంలో చపాతీ వేడి చేస్తున్నాడు. రెండింటికి మధ్యలో అడ్డుగోడగా గోధుమ పిండిని పెట్టాడు.
Train Accident Video: నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కోవడంతో..
ఇలా గోధుమ పిండికి ఓ వైపు కూర చేస్తూ, రెండో వైపు చపాతీ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్రెయిన్‌కు బాగానే పని చెబుతున్నాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఒక పాత్రలో రెండు వంటలు.. ఐడియా అదుర్స్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లు, 103 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Pig viral video: ఈ పంది అలెర్ట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎలా తప్పించుకుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..