Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:11 PM
ఓ వ్యక్తి చేపలతో నిండిన వలను చెరువు గట్టున పెట్టి ఉంటాడు. అయితే అందులోని ఓ చేప.. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది. అది అసాధ్యం అన్నట్లుగా మిగతా చేపలన్నీ కామ్‌గా ఉండిపోతాయి. కానీ ఆ చేప మాత్రం.. ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

‘‘ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ ఉండదు. చాలా మంది ఈ ప్రయత్నం చేయక.. జీవితంలో రాజీపడి బతుకుసాగిస్తుంటారు. మరికొందరు అనుకున్నది సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరకు అనుకున్నది సాధిస్తుంటారు. కొన్నిసార్లు ఈ ప్రయత్నం.. ప్రాణం కూడా పోస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చేప ప్రాణాలు పోతాయనుకున్న క్రమంలో ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ లేదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలతో నిండిన వలను చెరువు గట్టున పెట్టి ఉంటాడు. అయితే అందులోని ఓ చేప.. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది. అది అసాధ్యం అన్నట్లుగా మిగతా చేపలన్నీ కామ్‌గా ఉండిపోతాయి. కానీ ఆ చేప మాత్రం.. ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని ఎగురుతూ ఉంటుంది.
Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..
ఇలా పదే పదే పైకి ఎగురుతూ చివరకు ఆ వల నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో మరింత పైకి ఎగురుతూ వెళ్లి.. (fish escaped from net and jumped into the water) చూస్తుండగా చెరువు నీటిలోకి దూకేస్తుంది. మిగతా చేపలు మాత్రం ప్రయత్నాలు చేయలేక.. ఆ వలలోనే ప్రాణాలను వదిలేస్తాయి. ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ లేదు.. అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది.
Funny Viral Video: అరే.. ఇలా జరిగిందేంటీ.. ఇది ఫ్యానా లేక డ్రోనా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చేపను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలి’’.. అంటూ కొందరు, ‘‘ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67వేలకు పైగా లైక్‌లు, 3.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..