Share News

Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:55 PM

ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది. వధువు కోసం వేచి చూస్తున్న వరుడికి.. షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. వధువుకు బదులుగా..

Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..

వివాహ కార్యక్రమాలన్నీ ప్రస్తుతం వింత వింత సంఘటనలకు కేంద్రంగా మారిపోయాయి. సినిమా కనిపించే సీన్లు, సినిమా కామెడీని తలదన్నే సంఘటలన్నీ పెళ్లిళ్లలో చూస్తుంటాం. మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి ప్రతి ఘట్టంలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంటుంది. చివరకు ఇలాంటి సంఘటనలన్నీ కలిసి వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పెళ్లిలో వరుడు డైనోసార్‌తో డాన్స్ చేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage ) కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది. వధువు కోసం వేచి చూస్తున్న వరుడికి.. షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. వధువుకు బదులుగా ఓ డైనోసార్ నడుచుకుంటూ వస్తుంది.

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..


డైనోసార్‌ను చూడగానే వరుడు మొదట అవాక్కైనా.. తర్వాత నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాడు. డైనోసార్‌ బొమ్మతో (Groom's dance with dinosaur) కలిసి డాన్స్ కూడా చేస్తాడు. ఇలా చాలా సేపు డైనోసార్‌తో కలిసి వరుడు డాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ డైనోసార్ బొమ్మలో నుంచి వధువు (Bride) బయటికి వచ్చేస్తుంది. ఆమెను చూడగానే వరుడు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఇలా వధువు పెళ్లి మంటపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చి అంతా అవాక్కయ్యేలా చేస్తుంది.

Funny Viral Video: అరే.. ఇలా జరిగిందేంటీ.. ఇది ఫ్యానా లేక డ్రోనా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘భవిష్యత్‌లో జరగబోయే ఘటనలకు ట్రయల్ రన్‌లా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: చెరుకు మిషన్‌లో ఇరుక్కున్న మహిళ జడ.. చివరకు ఏమైందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:55 PM