Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:54 PM
ఓ విందు కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథులకు వివిధ రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..

‘‘మనిషికి ఆశ ఉండాలి కానీ.. అత్యాశ ఉండకూడదు’’.. అని పెద్దలు అంటుంటారు. చాలా మంది అత్యాశకు పోయి చివరకు అనర్ధాలు కొనితెచ్చుకుంటుంటారు. మరికొందరు ఇదే అత్యాశ కారణంగా అందరిలో నవ్వులపాలు అవుతుంటారు. ఇంకొందరి అత్యాశ వల్ల మిగతా వారు ఇబ్బందులు పడుతుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ విందు కార్యక్రమంలో కొందరు అతిథలు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘కరువు బ్యాచ్ అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విందు కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ (Marriage) కార్యక్రమానికి హాజరైన అతిథులకు వివిధ రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. భోజనాల కౌంటర్ల (Food stall) వద్దకు అతిథులంతా ఒక్కసారిగా తోసుకొస్తారు.
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
జనాలు ఎక్కువ అవడంతో ప్లేట్లు పట్టుకుని ఒకరిమీద ఒకరు పడుతుంటారు. ఇంతలో వంట చేసే వారు నూనెలో చిన్న సైజులో ఉండే పూరీలను వేయించి, టేబుల్‌పై ఉన్న ప్లేటులో వేస్తాడు. ఇలా ప్లేటులో వేశాడో లేదో.. అంతా అంతా ప్లేటును పక్కకు లాగేస్తారు. ఎవరి చేతికి వచ్చిన పూరీలను వారు లాక్కుని తమ ప్లేట్లలో వేసుకుంటారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరుగుతుంది. అయినా ఎవరూ వెనక్కు తగ్గకుండా ఎవరి చేతికి వచ్చిన పూరీలను వారు లాక్కుని పక్కకు వెళ్లిపోతారు.
Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..
అతిథుల నిర్వాకం చూసి మిగతా వారు అలాగే చూస్తూ నిలబడి ఉంటారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కరువు బ్యాచ్‌లా ఉన్నారే’’.. అంటూ కొందరు, ‘‘అతిథులా లేక రాక్షసులా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..