ATM Viral Video: సాయం పేరుతో ఇతనెలా మోసం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:12 PM
ఓ మహిళ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎం గదిలోకి వెళ్తుంది. ఓ దొంగ ఆమెను అనుసరిస్తూ అదే ఏటీఎం గదిలోకి వెళ్లి వెనుకే నిలబడ్డాడు. ఏటీఎం కార్డును మిషిన్ లోపల స్క్రాచ్ చేయగా.. డబ్బులు రాలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్నిసార్లు దొంగల చేతివాటం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. మరికొన్నిసార్లు వారు చేసే మోసాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉంటాయి. కొందరు దొంగలు కళ్ల ముందు ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏటీఎం గదిలో ఓ దొంగ మహిళకు సాయం చేసే క్రమంలో ఎలా మోసం చేశాడో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎం గదిలోకి (ATM Room) వెళ్తుంది. ఓ దొంగ ఆమెను అనుసరిస్తూ అదే ఏటీఎం గదిలోకి వెళ్లి వెనుకే నిలబడ్డాడు. ఏటీఎం కార్డును మిషిన్ లోపల స్క్రాచ్ చేయగా.. డబ్బులు రాలేదు. దీంతో ఆమెకు అర్థం కాక.. కార్డును పదే పదే స్క్రాచ్ చేస్తుంది. ఇంతలో వెనుక ఉన్న వ్యక్తి.. ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు.
ఆమె చేతిలోని ఏటీఎం కార్డును తీసుకుని సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేక.. అతడు చెప్పినట్లు వింటుంది. ఆమె అమాయకత్వాన్ని గమనించిన ఆ దొంగ.. అప్పటికే అలాంటి ఏటీఎం కార్డును సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆమెకు సలహాలు ఇచ్చే క్రమంలోనే (Thief changed ATM card) ఏటీఎం కార్డును మార్చేశాడు ఆమె కార్డును జేబులో వేసుకుని, అతడి చేతిలోని నకిలీ కార్డును ఆమె చేతికి ఇచ్చాడు. ఇలా ఎంతో చాకచక్యంగా ఆమెను బోల్తా కొట్టించాడన్నమాట.
ఇలా కార్డులు మార్చి చోరీలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త వారికి ఏటీఎం కార్డులు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో పాపం.. అమాయకురాలు అనవసరంగా మోసపోయందిగా’.. అంటూ కొందరు, ‘ఏటీఎంలో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55 వేలకు పైగా లైక్‌లు, 5.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి:
భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్
తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్