Share News

Watch Viral Video: చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా.. పక్కకు తీసి చూడగా..

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:01 AM

ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో చెప్పులు వేసుకునేందుకు వెళ్లాడు. అయితే తీరా చెప్పులు వేసుకునే సమయంలో అతడికి అనుమానం కలిగింది. చెప్పుల మాటున ఏదో ఉన్నట్లు డౌట్ రావడంతో వాటిని పక్కకు తీశాడు.

Watch Viral Video: చెప్పులే కదా అని చటుక్కున వేసుకుంటున్నారా..  పక్కకు తీసి చూడగా..

కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి అంతా బాగుంది అని అనిపించినా.. తీక్షణంగా చూస్తే అందులో ఏదో ఒక సమస్య లేదా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా , ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తీరా వేసుకునే ముందు చెప్పులు తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చెప్పులు కూడా చంపేయొచ్చు’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో చెప్పులు వేసుకునేందుకు వెళ్లాడు. అయితే తీరా చెప్పులు వేసుకునే సమయంలో అతడికి అనుమానం కలిగింది. చెప్పుల మాటున ఏదో ఉన్నట్లు డౌట్ రావడంతో వాటిని పక్కకు తీశాడు.


చెప్పులను తీసి చూడగా.. వాటి వెనుక అత్యంత ప్రమాదకర (Russell's viper snake hiding behind slippers) రస్సెల్ వైపర్ పాము చుట్టు చుట్టుకుని పడుకుని ఉంది. దగ్గరికి వెళ్లగా తల పైకి ఎత్తి కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుని బాటిల్‌లో బంధించాడు. ఆ తర్వాత దాన్ని అడవిలోకి వదిలేశాడు. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చెప్పులు కూడా చంపేయచ్చన్నమాట’.. అంటూ కొందరు, ‘చెప్పులు వేసుకునేందుకు కూడా చెక్ చేసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 88వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 10:06 AM