Share News

Crocodile Viral Video: నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:06 PM

వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంటుంది. వాగులో ఉన్న దారిలో వెళ్లలేక చాలా వాహనాలు అటూ, ఇటూ ఆగిపోయి ఉంటాయి. ఇంతలో ఓ జీపు అటుగా వచ్చింది. ఆ డ్రైవర్ వాగును దాటేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Crocodile Viral Video: నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మామూలుగా మొసలి ఎంతో శక్తివంతమైన జీవి. అలాంటిది ఇక నీటిలో ఉన్న సమయంలో దాని పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి వేటను టార్గెట్ చేసిందంటే.. ఇక దాన్నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. దీంతో పెద్ద పెద్ద జంతువులు కూడా దాని జోలికి వెళ్లేందుకు భయపడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, జీపు కింద పడిన మొసలి వీడియో తెగ వైరల్ అవుతోంది. వాగు దాటుతున్న సమయంలో జీపు కింద భారీ మొసలి పడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటు చేసుకుంది. వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తుంటుంది. వాగులో ఉన్న దారిలో వెళ్లలేక చాలా వాహనాలు అటూ, ఇటూ ఆగిపోయాయి. ఇంతలో ఓ జీపు అటుగా వచ్చింది. ఆ డ్రైవర్ వాగును దాటేందుకు ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే జీపు సాఫీగా అవతలి వైపునకు వెళ్తుంది.


అయితే తీరా వాగు దాటే సమయంలో (Crocodile falls under jeep) జీపు కింద భారీ మొసలి పడుతుంది. టైర్ల కింద పడిపోవడంతో జీపు ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. డ్రైవర్‌కు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపేశాడు. అయితే ఇంతలో ఆ మొసలి ఎలాగోలా టైర్ల కింద నుంచి తప్పించుకుని, అవతలి వైపునకు వెళ్లిపోతుంది. దీంతో అప్పటిదాకా తన జీపు కింద పడింది మొసలి అని తెలుసుకుని ఆ డ్రైవర్ షాక్ అయ్యాడు. ఈ సీన్ చూసి రోడ్డుకు అవతలి వైపు ఉన్న వారు కూడా అవాక్కయ్యారు. అయితే ఆ సమయంలో డ్రైవర్ జీపు నుంచి కిందకు దిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.


అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ సీన్ చూస్తుంటేనే భయమేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఈ జీపు డ్రైవర్ టైం బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 79 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 01:14 PM