Share News

Snake Shocking Video: పాముపై వింత ప్రయోగం.. ఎదురుగా అద్దం పెట్టడంతో.. చివరకు..

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:22 AM

సాధారణంగా అడవిలో అద్దాలను ఏర్పాటు చేసి, జంతువలు రియాక్షన్‌ను కెమెరాలో బంధించడం చూస్తంటాం. అద్దంలో తమను తాము చూసుకునే జంతువులు వింతగా ప్రవర్తించడం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా, ఓ స్నేక్ క్యాచర్‌ పాముపై ఇలాంటి ప్రయోగం చేశాడు..

Snake Shocking Video: పాముపై వింత ప్రయోగం.. ఎదురుగా అద్దం పెట్టడంతో.. చివరకు..

పాములు ఎంత ప్రమాదకరమైనా వాటి జోలికి వెళ్లనంతవరకూ ఎవరికీ ఎలాంటి హానీ చేయవు. వాటి చుట్టూ ఉన్న జీవులను, ఎదురయ్యే ప్రమాదాలను కళ్లు, ముక్కు మధ్య ఉండే సెన్సార్ల ద్వారా గుర్తిస్తాయి. వాటికి ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతుందన్న సమయంలో బుసలు కొట్టి భయపెట్టడం, తప్పనిసరి పరిస్థితుల్లో కాటేయడం ద్వారా తమని తాము రక్షించుకుంటాయి. పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పాముపై వింత ప్రయోగం చేశాడు. దాని ఎదురుగా అద్దం పెట్టడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అడవిలో అద్దాలను ఏర్పాటు చేసి, జంతువలు రియాక్షన్‌ను కెమెరాలో బంధించడం చూస్తంటాం. అద్దంలో తమను తాము చూసుకునే జంతువులు వింతగా ప్రవర్తించడం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా, ఓ స్నేక్ క్యాచర్‌ పాముపై ఇలాంటి ప్రయోగం చేశాడు. సదరు వ్యక్తి నాగు పామును పట్టుకునేందుకు సమీపానికి వెళ్లాడు. అతను సమీపానికి రాగానే పాము పడగ విప్పి బుసలు కొడుతుంది.


అయితే ఆ తర్వాత అతను పాముపై వింత ప్రయోగం చేశాడు. దాని ఎదురుగా అద్దం పెడితే ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఓ అద్దం తీసుకుని (Man Placed Mirror in front of Snake) పాముకు ఎదురుగా పెట్టాడు. అద్దంలో తనను తాను చూసుకున్న పాము.. కాసేపు అలాగే పడగ విప్పి గమనిస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా బుసలు కొడుతూ (Snake biting on mirror) అద్దంపై కాటేస్తుంది. ఇలా ఎన్నిసార్లు దాని ముందు అద్దం పెట్టినా.. కాటేస్తూ భయపెడుతూనే ఉంటుంది.


ఇలా పాము అద్దం ముందు ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంంటోంది. కాగా, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాీలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాము రియాక్షన్ ఫన్నీగా ఉందిగా’.. అంటూ కొందరు, ‘తనను తాను చూసుకుని భయపడ్డ పాము’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 82 వేలకు పైగా లైక్‌లు, 11.5 మిలియన్లకు పైగా లైక్‌‌‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 07:26 AM