Old Woman Funny Video: ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:43 PM
ఓ వృద్ధురాలు ఇంట్లో ఎండ వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. కూలర్ లేకపోవడంతో చల్లగాలి కోసం వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ బంపర్ ఐడియా వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియా రోజురోజుకూ వింతలు, విశేషాలు, అద్భుతాలతో పాటూ ఆశ్చర్యకర ఘటనలకు నిలయంగా మారుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఎలాగైనా నెట్టింట ఫేమస్ కావాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తెలివిగా ఆలోచిస్తూ చేస్తే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వింత వింత పనులు చేస్తున్నారు. ఇళ్లల్లోని మహిళలు కూడా అనేక ప్రయోగాలు చేయడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వృద్ధురాలి వీడియో వైరల్ అవుతోంది. ఫ్రిడ్జ్‌ను ఆమె వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అవ్వా.. నీ తెలివికి జోహార్లు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధురాలు ఇంట్లో ఎండ వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. కూలర్ లేకపోవడంతో చల్లగాలి కోసం వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ బంపర్ ఐడియా వచ్చింది.
ఐడియా వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టింది. నేరుగా ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి డోరు తీసింది. ఆ తర్వాత (Old woman lying in front of fridge) ఎంచక్కా దానికి ఎదురుగా పడుకుంది. ఫ్రిడ్జ్ నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రపోయిందన్నమాట. ఇలా వృద్ధురాలు విచిత్రంగా ఆలోచించి, ఫ్రిడ్జ్‌ను కూలర్‌లా వాడేసింది. ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ అవ్వ తెలివి మామూలుగతా లేదుగా’.. అంటూ కొందరు, ‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి