Sandstorm: వామ్మో.. భారీ ఇసుక తుఫాను.. నివాసాలను ఎలా ముంచేస్తుందో చూడండి..
ABN , Publish Date - May 01 , 2025 | 03:06 PM
చాలా దేశాలను ఇసుక తుఫానులు వెంటాడడం చూస్తున్నాం. కొన్నిసార్లు ఈ తుఫానుల కారణంగా ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా, ఈ ఇసుక తుఫానుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

కార్చిచ్చు, ఇసుక తుఫానుల కారణంగా జనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. తాజాగా అమెరికా ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో కార్చిచ్చు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దీంతో పాటూ చాలా దేశాలను ఇసుక తుఫానులు వెంటాడడం చూస్తున్నాం. కొన్నిసార్లు ఈ తుఫానుల కారణంగా ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంటుంది. తాజాగా, ఈ ఇసుక తుఫాను ఇజ్రాయెల్‌ను వణికిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఇసుక తుఫానుకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్‌లోని (Israel) దక్షిణ భాగాలైన నెగెవ్ ఎడారి, బీర్షెబా ప్రాంతాలను ఇసుక తుఫాను కమ్మేసింది. నెగెవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాన్ని ఇసుక తుఫాను ముంచేసిందని తెలుస్తోంది. బలమైన ఇసుక తుఫాను (Sandstorm) కారణంగా పెద్ద పెద్ద కుర్చీలతో పాటూ అనేక వస్తువులు కొట్టుకుపోతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే ఇద్దరు మహిళలు నడిచేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని, పగటి పూట గాలులతో పాటూ పొగమంచు ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తీరం వెంబడి 98 నుంచి 100 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మరో కార్చిచ్చు కూడా ఇజ్రాయెల్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..
జెరూసలెం శివారు అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు 120 అగ్నిమాపక, రెస్క్యూ బృందాలతో పాటూ విమానాలు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇసుక తుఫాను, కార్చిర్చు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యక్ష వేడుకలను కూడా రద్దు చేసింది. కాగా, ఇసుక తుఫానుకు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..