Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - May 01 , 2025 | 05:38 PM
ఓ వ్యక్తి రైలు పట్టాలపై చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రైలు పట్టాలకు కాస్త దూరంలో నిలబడ్డ ఆ వ్యక్తి.. తీరా రైలు వచ్చే ముందు ప్రమాదకర విన్యాసం చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

కొందరు పది మందిలో హీరో అనిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆతృతలో ఎవరూ చేయని సాహసాలను ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి విన్యాసాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆ వెంటనే ఆగ్రహం కూడా వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైలు పట్టాలపై చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రైలు పట్టాలకు కాస్త దూరంలో నిలబడ్డ ఆ వ్యక్తి.. తీరా రైలు వచ్చే ముందు పరుగెత్తుకుంటూ వచ్చి, పట్టాలపై పల్టీలు కొడుతూ అవతలి వైపునకు దూకేశాడు.
Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..
ఇలా రైలుకు ముందు తలకిందులుగా పల్టీలు కొట్టి, (Man flipped on train tracks) చూస్తుండగానే అవతలి వైపు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే రైలు సమీపానికి రావడానికి ముందే అతను అవతలి వైపునకు దాటుకోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అతను అలా ప్రమాదకరమైన విన్యాసం చేస్తుంటే.. అతడి స్నేహితులు వారించాల్సింది పోయి.. చుట్టూ నిలబడి వీడియోలు తీస్తున్నారు.
Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..
కాగా, ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చాలా త్వరగా దూకేశాడు.. కొంచెం ఆగి ఉండాల్సింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ ప్రయత్నించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 2.36 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..