Share News

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

ABN , Publish Date - May 01 , 2025 | 04:28 PM

ఓ యువతి వాష్ రూంలో చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వెంటనే జరిగిన ఘటన చూసి తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా వాష్ బేసిన్‌లో అంతా చేతులు కడుక్కోవడం కామన్. అయితే ఓ యువతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు తప్పని తెలిసి కూడా విరుద్ధంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అప్పటికప్పుడే గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి వాష్ రూంలో చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వెంటనే జరిగిన ఘటన చూసి తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా వాష్ బేసిన్‌లో అంతా చేతులు కడుక్కోవడం కామన్.

Elephant Viral Video: ఏనుగులు హంతకులుగా మారితే ఎలా ఉంటుందో తెలుసా.. అన్నీ కలిసి చివరకు..


అయితే ఈ యువతి మాత్రం ఏకంగా తన కాళ్లను అందులో (young woman washing her feet in washbasin) పెట్టి శుభ్రం చేసుకుంది. ముందుగా ఒక కాలిని వాష్ బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకున్న యువతి.. ఆ తర్వాత మరో కాలిని కూడా అందులో పెట్టి కడుక్కోవాలని చూస్తుంది. అయితే ఈ క్రమంలో కాలు జారి ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడిపోతుంది. కిందపడగానే కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Robbery Viral Video: ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా.. రూ.29లు రీచార్జ్ చేసుకుని.. వెళ్తూ వెళ్తూ..


కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేసే వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈమె నిర్వాకం మరీ దారుణంగా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Sandstorm: వామ్మో.. భారీ ఇసుక తుఫాను.. నివాసాలను ఎలా ముంచేస్తుందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2025 | 04:28 PM