Share News

Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:09 PM

రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును మూసేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలన్నీ ఆగిపోయాయి. ఓ వ్యక్తి గేటుకు పక్కనే బైకు ఆపుకొని ఉన్నాడు. అయితే ఎంతసేపటికీ గేటు తెరవకపోవడంతో అతడికి చిరాకు పుట్టింది. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

రైల్వే గేటు వద్ద కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు గేటు వేసినా కూడా కొందరు అడ్డదిడ్డంగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోతుంటారు. మరికొందరు అదృష్టం బాగుండి తృుటిలో ప్రాణాపాయం నంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైల్వే గేటు వద్ద చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రైలు గేటు వద్ద బైకర్ నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘రైలు పట్టాలు ఇలా దాటడం ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును మూసేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలన్నీ ఆగిపోయాయి. ఓ వ్యక్తి గేటుకు పక్కనే బైకు ఆపుకొని ఉన్నాడు. అయితే ఎంతసేపటికీ గేటు తెరవకపోవడంతో అతడికి చిరాకు పుట్టింది. అలాగని అడ్డదిడ్డంగా దాటకూడదని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రైలు పట్టాలు దాటేయాలని ఫిక్స్ అయ్యాడు.

Viral Video: వీళ్లు మనుషులేనా.. లారీ డ్రైవర్ మంటల్లో కాలుతున్నా.. ఏం చేస్తున్నారో చూడండి..


ఇందుకోసం చివరకు ఏకంగా బైకునే పైకి లేపేసి, తన భుజాలపై పెట్టుకున్నాడు. తర్వాత ఎంచక్కా దాని మోసుకుంటూ (Man crosses train tracks carrying bike on shoulders) రైలు పట్టాలను దాటేశాడు. సాధారణంగా బైకర్లు రైలు గేటు కింద నుంచి దూరిపోవడం చేస్తుంటారు. అయితే ఇతను మాత్రం అందుకు విరుద్ధంగా ఇలా విచిత్రంగా రైలు పట్టాలు దాటడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇతడి విచిత్ర విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Snake Viral Video: స్కూటీపై వస్తున్న వ్యక్తి.. మధ్యలో సడన్‌గా రోడ్డుపైకి దూసుకొచ్చిన పాము.. చివరకు..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘రైలు గేటును ఇలా దాటడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రాంక్ చేసే ముందు ఆలోచించడం బెటర్.. ఈ యువకుడి పరిస్థితి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Updated Date - Mar 07 , 2025 | 04:09 PM