Share News

Cat Viral Video: పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..

ABN , Publish Date - Mar 05 , 2025 | 07:56 PM

తల్లి ప్రేమకు సాటి మరోటి ఉండదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. పిల్లల సంరక్షణ విషయంలో మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. జంతువులు కూడా అంతే స్థాయిలో తమ పిల్లలను కాపాడుకుంటాయి. తాజాగా ఓ పిల్లి తన పిల్లల కోసం చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది..

Cat Viral Video: పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..
cat carrying teddy bear

తల్లి ప్రేమకు సాటి మరోటి ఉండదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. పిల్లల సంరక్షణ విషయంలో మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. జంతువులు కూడా అంతే స్థాయిలో తమ పిల్లలను కాపాడుకుంటాయి. వాటిని సంతోషపరచడానికి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్లలను ఆడించేందుకు తల్లి పిల్లి పడిన కష్టం అందరినీ ఆకట్టుకుంటోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చిన్న పిల్లలను ఆడించేందుకు తల్లి బొమ్మలు అందించడం చూస్తుంటాం. ఈ సీన్ చూసి ఇన్‌స్పైర్ అయిందో ఏమో గానీ ఓ పిల్లి తన పిల్లలను ఆడించడానికి ఎంతో కష్టపడింది. మనుషుల్లాగానే తన పిల్లలను కూడా బొమ్మలు అందించి ఆడించాలని అనుకున్న పిల్లి.. చివరకు ఓ టెడ్డీ బేర్‌ను నోట కరుచుకుంది.

Watermelon Viral Video: వామ్మో.. పుచ్చకాయ ఇలాక్కూడా ఉంటుందా.. వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..


టెడ్డీ బేర్‌ను తీసుకుని రెండు గోడల మధ్యలోకి దిగి, కాలువ మీద ప్రమాదకరంగా నడుస్తూ వెళ్లింది. కాలువ గోడలపై అటూ, ఇటూ మారుతూ ఎంతో కష్టపడి ఆ టెడ్డీ బేర్‌ను తన పిల్లల వద్దకు తీసుకెళ్లింది. టెడ్డీ బేర్‌ను చూడగానే పిల్లి పిల్లలు కూడా దాని చుట్టూ చేరాయి. వాటి ఆనందం చూసి తల్లి పిల్లి అలాగే చూస్తుండిపోయింది. ఇలా పిల్లి తన పిల్లలు ఆడుకునేందుకు టెడ్డీ బేర్‌ను అందించి అందరినీ ఆకట్టుకుంటోంది.

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Updated Date - Mar 05 , 2025 | 07:56 PM