Share News

Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:22 PM

ఓ పిల్ల ఏనుగు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలి.. పిల్ల ఏనుగును చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నించింది. మొసలి ఊహించని దాడితో ఏనుగు షాక్ అయింది. చివరకు ఏమైందో చూడండి..

Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటిని కెలకాలని చూస్తే మాత్రం చుక్కలు చూపిస్తాయి. పులులు, సింహాలు, మొసళ్లు.. ఇలా ఏవైనా వాటి ముందు తోకముడవాల్సిందే. కొన్నిసార్లు వాటి దాడిలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి పిల్ల ఏనుగుపై దాడి చేయాలని చూసింది. చివరకు దాని పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల ఏనుగు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం నీటిలో పొంచి ఉన్న మొసలి.. పిల్ల ఏనుగును చూడగానే దాడి చేసేందుకు ప్రయత్నించింది. మొసలి ఊహించని దాడితో ఏనుగు షాక్ అయింది. ఏనుగు తొండం పట్టుకుని నీటిలోకి లాగేందుకు ప్రయత్నిస్తుంది.

Woman Viral Reel Video: వంట చేస్తూ రీల్ చేయాలనుకుంది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..


అయితే ఏనుగు చివరకు మొసలినే బయటికి లాగేస్తుంది. మరుసటి నిముషంలో పరిస్థితి తారుమారవుతుంది. దాడి చేయడానికి చూసిన మొసలిని (elephant trampled crocodile) ఆ ఏనుగు తన కాళ్లతో తొక్కేస్తుంది. తన బరువంతా ప్రయోగించి బలంగా తొక్కేయడంతో మొసలి విలవిల్లాడిపోతుంది. నొప్పిని తట్టుకోలేక తల పైకి ఎత్తి నోరు తెరుస్తుంది. ఇలా దాడి చేయాలని చూసి మొసలికి ఈ పిల్ల ఏనుగు చుక్కలు చూపించిందన్నమాట.

Viral Video: మరీ ఇంత మూఢనమ్మకమా.. రోడ్డుపై ఎర్రటి కుండలు చూసి.. చివరకు ఏం చేశారో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఈ ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Woman Funny Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇంతే.. రోడ్డుపై ఈమె చేసిన ఘనకార్యం చూస్తే ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Updated Date - Mar 05 , 2025 | 04:22 PM