Share News

Theft Funny Video: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎంత తెలివిగా ఎత్తుకెళ్లాడంటే..

ABN , Publish Date - Mar 04 , 2025 | 07:04 PM

ఓ వ్యక్తి స్టూల్‌పై కూర్చుని, టీవీ చూస్తూ ప్లేటులోని ఆహారం తింటుంటాడు. ఇంతలో ఓ బాలుడు చీపురుతో సీలింగ్‌పై శుభ్రం చేస్తూ అటుగా వస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది..

Theft Funny Video: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎంత తెలివిగా ఎత్తుకెళ్లాడంటే..

కొందరు తెలివిగా చోరీలు చేయడం చూస్తుంటాం. ఇంకొందరు అతి తెలివిగా చోరీలు చేస్తుంటారు. మరికొందరైతే మన కంటికి తెలీకుండా మన జేబులోని పర్సును, ఫోన్లను కొట్టేస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. అలాగే తమాషా చోరీలకు సబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ బుడ్డోడు చేసిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్టూల్‌పై కూర్చుని, టీవీ చూస్తూ ప్లేటులోని ఆహారం తింటుంటాడు. ఇంతలో ఓ బాలుడు చీపురుతో సీలింగ్‌పై శుభ్రం చేస్తూ అటుగా వస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. సీలింగ్‌పై ఏదో ఉన్నట్లు, దాన్ని తీసేస్తున్నట్లు బాలుడు నటించడంతో అతను కూడా సీలింగ్ వైపు చూస్తుంటాడు.

AC Viral Video: అది బీరువా కాదు.. ఏసీ.. వీళ్లెలా సెట్ చేశారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


సమీపానికి వచ్చిన బాలుడు.. ఓ చేత్తో చీపురుతో సీలింగ్‌పై శుభ్రం చేస్తున్నట్లు నటిస్తూ.. మరో చేత్తో ప్లేటులోని (boy cleverly stole food from plate) ఆహారాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇది గమనించని ఆ వ్యక్తి అలా సీలింగ్‌ వైపే చూస్తుంటాడు. అయితే తర్వాత ప్లేటులో మిగిలిన ఆహారాన్ని తిందామని చూస్తే.. ఖాళీ ప్లేటు కనిపిస్తుంది. అప్పటిదాకా ప్లేటులో ఉన్న ఆహారం.. అంతలోనే కనిపించకుండాపోవడం చూసి అవాక్కవుతాడు.

Police Viral Video: మహిళా పోలీసుకు షాక్.. విధుల్లో ఉండగా ఆమె చేసిన పనికి.. చివరకు..


నేలపై మొత్తం వెతికినా ఆహారం మాత్రం కనిపించదు. చివరకు దాన్ని ఆ బాలుడే ఎత్తుకెళ్లాడని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఇదంతా నవ్వుకోవడానికి చేసినా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడి చోరీ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తెలివైన చోరీ అంటే ఇదే’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 33వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Funny Video: అందరి వద్దా ఆశీర్వాదం తీసుకున్నాడు.. మధ్యలో ఎలా మస్కా కొట్టాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Updated Date - Mar 04 , 2025 | 07:04 PM