Viral Video: క్షణం విలువ తెలిపే వీడియో.. కారులో వెళ్తుండగా ముందు గుండెలు అదిరిపోయే సీన్..
ABN , Publish Date - Mar 02 , 2025 | 11:51 AM
అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. అదే టైం బాగోలేకుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..

అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. అదే టైం బాగోలేకుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో వెళ్తుండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. క్షణం ఆలస్యం వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘‘క్షణం విలువ తెలిపే వీడియో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) కులు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాతారణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఈ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కులులో అయితే రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Funny Stunt Video: బాబాయ్ బ్యాలెన్స్ మామూలుగా లేదుగా.. బీరు బాటిల్ స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..
మరోవైపు కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కులులోని ఓ ఘాట్ రోడ్డులో వాహనాలు వెళ్తుండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు కూలిపోతాయేమో అనే భయంతో కొందరు వాహనదారులు రోడ్డు పక్కన ఆపుకొన్నారు.
Viral Video: రోడ్డు పక్కన గాల్లోకి లేచిన స్కూటీ.. తీరా చివరకు చూడగా షాకింగ్ సీన్..
అయితే ఓ కారు యజమాని మాత్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే (landslide fell in front of the car) కొండచరియలు ఒక్కసారిగా విరిగి రోడ్డుపై పడ్డాయి. కారు ముందే ఓ పెద్ద బండరాయి పడిపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఒక్క క్షణం ముందుగా వెళ్లి ఉన్నా కారు నుజ్జునుజ్జయ్యే అయ్యేది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 37 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ద్యావుడా.. ఫోన్ చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..