Share News

Viral Video: వామ్మో.. ఇది సైక్లింగ్ కాదు.. కిల్లింగ్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:08 AM

ఇద్దరు యువకులు సైక్లింగ్ చేస్తున్నారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు సైకిల్ తొక్కుతున్న మాట వాస్తవమే గానీ.. సైక్లింగ్ చేస్తున్న ప్రాంతమే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది..

Viral Video: వామ్మో.. ఇది సైక్లింగ్ కాదు.. కిల్లింగ్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక మంది ఏదో ఒకటి చేసి నెటిజన్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు ఫన్నీ ప్రాంక్‌లు చేస్తుంటే.. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు సైక్లింగ్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇది సైక్లింగ్ కాదు.. కిల్లింగ్..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు సైక్లింగ్ (Cycling) చేస్తున్నారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు సైకిల్ తొక్కుతున్న మాట వాస్తవమే గానీ.. సైక్లింగ్ చేస్తున్న ప్రాంతమే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. నేలపై సైక్లింగ్ చేయాల్సిన వారు.. ఏకంగా ఓ పెద్ద బ్రిడ్జ్‌పై చేశారు.

Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..


అందులోనూ బ్రడ్జిపై ఉన్న ఇనుప స్తంభాలపై (Youth riding bicycles on bridge) సైకిల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయినా వారు మాత్రం ఏమాత్రం అదుపు తప్పకుండా ఎంతో చాకచక్యంగా సైకిల్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. చూస్తుండగానే బ్రిడ్జిపై ఒక వైపు నుంచి మరోవైపునకు సులభంగా చేరుకున్నారు.

Funny Game Video: లైవ్ గేమ్ అంటే ఇదేనేమో.. బ్రిడ్జి పైనుంచి కార్లతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సోదరులు యముడికే సవాల్ విసురుతున్నారుగా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇదేం సైక్లింగ్‌రా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌‌‌లు, 4.35 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఇదేం ట్రిక్‌రా నాయనా.. యువతిని బోల్తా కొట్టించి.. రైల్లో ఎలా కొట్టేశాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 11:08 AM