Funny Viral Video: ఇదేం ట్రిక్‌రా నాయనా.. యువతిని బోల్తా కొట్టించి.. సీటు ఎలా కొట్టేశాడో చూస్తే..
ABN , Publish Date - Mar 01 , 2025 | 09:39 AM
మెట్రో రైలు ఎక్కిన ఓ యువకుడికి కూర్చోవడానికి సీటు కనిపించదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వచ్చేటప్పుడే పక్కా ప్లాన్‌తో వస్తాడు. ఇందుకోసం చేతిలో రంగు రంగుల శాలువాను పట్టుకుని వస్తాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

రైలు ప్రయాణం కొన్నిసార్లు సంతోషాన్ని కలిగిస్తే.. మరికొన్నిసార్లు విసుగును తెప్పిస్తుంది. ఇంకొన్నిసార్లు విచిత్ర అనుభవాన్ని అందిస్తుంది. అయితే కొన్నిసార్లు సీటు కోసం ఏకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మెట్రో రైల్లో యువతిని తెలివిగా బోల్తా కొట్టించి, సీటు కొట్టేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇదేం టెక్నిక్‌రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైలు (Metro Train) ఎక్కిన ఓ యువకుడికి కూర్చోవడానికి సీటు కనిపించదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వచ్చేటప్పుడే పక్కా ప్లాన్‌తో వస్తాడు. ఇందుకోసం చేతిలో రంగు రంగుల శాలువాను పట్టుకుని వస్తాడు. ఇది చూసేందుకు అతను చిన్న పిల్లాడిని ఎత్తుకుని వస్తునట్లుగా ఉంది.
అలా ఓ యువతి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. ‘‘చేతిలో పిల్లాడు ఉన్నాడు.. కాస్త సీటు ఇవ్వరా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అతడి పరిస్థితిని గమనించిన ఆ యువతి వెంటనే పైకి లేచి సీటు ఇస్తుంది. ఆమె లేవగానే సీటులో కూర్చున్న ఆ వ్యక్తి.. చేతిలోని శాలువాను విదిలించి, కాళ్ల మీద వేసుకుంటాడు. దీంతో ఆ యువతి నవ్వుకుుంటుంది. అలాగే పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. చివరగా నోటిలో పాల పీపాను (prank with towel in hand) పెట్టుకున్న ఆ వ్యక్తి తన ప్రాంక్‌ను ఇలా కంప్లీట్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మానవత్వంతో ఆలోచించి సీటు ఇచ్చిన యువతి ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం మరీ ఇవేం ప్రాంక్‌లురా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 16 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ చెప్పులను ఎత్తుకెళ్లాలంటే ఆలోచించాల్సిందే.. చెప్పుల దొంగలకు భలే షాక్ ఇచ్చాడుగా..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..