Funny Game Video: లైవ్ గేమ్ అంటే ఇదేనేమో.. బ్రిడ్జి పైనుంచి కార్లతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..
ABN , Publish Date - Mar 01 , 2025 | 10:15 AM
ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాడు. అయితే బ్రిడ్జ్ మధ్యలో నిలబడ్డ అతడికి.. కింద వెళ్తున్న వాహనాలను చూడగానే ఓ బంపర్ ఐడియా వచ్చేసింది. చివరకు అతను ఆగిన గేమ్ చూసి అంతా అవాక్కవుతున్నారు..

వీడియో గేమ్స్ అంటే ఇష్టపడని వారుండరు. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఫోన్లలో గేమ్స్ ఆడటం చూస్తుంటాం. కొందరు నిత్యం ఇదే పిచ్చిలో గడుపుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఇలా ఫోన్లలో గేమ్ ఆడితే ఏముందీ అనుకున్నాడో ఏమో గానీ.. వెరైటీగా గేమ్ ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బ్రిడ్జిపై నిలబడి కింద వెళ్తున్న కార్లతో ఎలా ఆడుకుంటున్నాడో చూసి అవాక్కవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతడి నిర్వాకం చూసిన నెటిజన్లు.. ‘‘లైవ్ గేమ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాడు. అయితే బ్రిడ్జ్ మధ్యలో నిలబడ్డ అతడికి.. కింద వెళ్తున్న వాహనాలను చూడగానే ఓ బంపర్ ఐడియా వచ్చేసింది. ఫోన్లలో ఆడే కార్ల గేమ్‌ను (Cars game) గుర్తు చేసుకున్న అతను.. దాన్ని రియల్‌గా ఆడేయాలని నిర్ణయించుకున్నాడు.
బ్రిడ్జిపై నిలబడ్డ అతను రోడ్డుపై పడిన (Man played live car game from bridge) తన నీడతో గేమ్ స్టార్ట్ చేశాడు. కార్ల నుంచి తప్పించుకోవడానికి అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇలా చాలా సేపు అటూ, ఇటూ తిరుగుతూ కార్లు, బస్సుల కింద పడకుండా తన నీడతో ఆడుకున్నాడు. అయితే చివరగా ఎలాగైతే గేమ్‌లో కారు ఢీకొంటుందో.. అచ్చం అలాగే ఇక్కడ కూడా అతడి నీడను ఓ కారు ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి ఈ గేమ్‌లో ఓడిపోయినట్లైందన్నమాట.
Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..
ఇలా ఆ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి లైవ్ గేమ్ ఆడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. లైవ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: ఇదేం ట్రిక్‌రా నాయనా.. యువతిని బోల్తా కొట్టించి.. రైల్లో ఎలా కొట్టేశాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..