Share News

Viral Video: కష్టపడటమే కాదు.. కాస్త కామన్‌సెన్స్ కూడా ఉండాలి.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Mar 01 , 2025 | 01:30 PM

ఓ వ్యక్తి సిమెంట్ రేకుల ఇంటికిపైకి ఎక్కుతాడు. రేకులపై ఉన్న లీకేజీలపై టేప్‌ వేస్తుంటాడు. సిమెంట్ రేకులపై టేప్ ఎలా వేయాలో అవగాహన కలిగిస్తుంటాడు. ఈ క్రమంలో చివరకు ఏమైందో మీరే చూడండి..

Viral Video: కష్టపడటమే కాదు.. కాస్త కామన్‌సెన్స్ కూడా ఉండాలి.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కొందరు తెలివిగా పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరు అతి తెలివిగా వ్యవహరిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇంకొందరు తెలివి తక్కువగా చేసే పనులు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సిమెంట్ రేకులపై లీకేజీలను అరికట్టేందుకు టేప్ వేశాడు. అయితే ఈ క్రమంలో అతను చేసిన నిర్వాకంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కష్టపడటమే కాదు.. కాస్త కామన్‌సెన్స్ కూడా ఉండాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సిమెంట్ రేకుల ఇంటికిపైకి ఎక్కుతాడు. రేకులపై ఉన్న (Man tapes cement roofing sheets) లీకేజీలపై టేప్‌ వేస్తుంటాడు. సిమెంట్ రేకులపై టేప్ ఎలా వేయాలో అవగాహన కలిగిస్తుంటాడు. ఎదురుగా ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ వీడియో చేస్తుంటాడు. రేకులపై ఏర్పడ్డ లీకేజీలపై టేపు ఎలా వేయాలో అందరికీ చూపిస్తుంటాడు.

Viral Video: వామ్మో.. ఇది సైక్లింగ్ కాదు.. కిల్లింగ్.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..


ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. టేప్ వేసిన తర్వాత దానిపై కాలు పెట్టి గట్టిగా తొక్కుతుంటాడు. అలా టేపుపై కాలు పెట్టి తొక్కుతూ ముందుకు రేకుల మధ్యలోకి వస్తాడు. ఇంతలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. రేకులు విరిగిపోవడంతో అతను ఒక్కసారిగా ధబేల్‌మని పైనుంచి కిందపడిపోతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఫోన్‌లో రికార్డ్ అవుతుంది.

Funny Game Video: లైవ్ గేమ్ అంటే ఇదేనేమో.. బ్రిడ్జి పైనుంచి కార్లతో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిర్లక్ష్యానికి ఫలితం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘కాస్త కామన్‌సెన్స్ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లు, 53 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఇదేం ట్రిక్‌రా నాయనా.. యువతిని బోల్తా కొట్టించి.. రైల్లో ఎలా కొట్టేశాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2025 | 01:30 PM