Funny Stunt Video: బాబాయ్ బ్యాలెన్స్ మామూలుగా లేదుగా.. బీరు బాటిల్ స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:26 AM
ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. స్కూటీపై వెళ్లడంతో వింతేముందీ.. అని మీకు సందేహం రావొచ్చు. అతను స్కూటీపై వెళ్లడంతో విశేషం ఏమీ లేకున్నా.. బీరు బాటిల్‌తో చేసిన స్టంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఎవరూ చేయలేని సాహసాలను కొందరు అవలీలగా చేసేస్తుంటారు. ఇలాంటి స్టంట్స్ చూసినప్పుడు.. ‘‘అరె.. ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి.. బీరు బాటిల్‌తో చేసిన స్టంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పవర్ ఆఫ్ 90 ఎమ్ఎల్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. స్కూటీపై వెళ్లడంతో వింతేముందీ.. అని మీకు సందేహం రావొచ్చు. అతను స్కూటీపై వెళ్లడంతో విశేషం ఏమీ లేకున్నా.. బీరు బాటిల్‌తో చేసిన స్టంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మందు కొట్టాడే ఏమో తెలీదు కానీ.. ఓ బీరు బాటిల్‌ను ఏకంగా (Beer bottle on head) తన తలపై పెట్టుకున్నాడు.
Viral Video: ద్యావుడా.. ఫోన్ చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది..
బాటిల్‌ను తలపై నిలబెట్టడమే కాకుండా ఏకంగా (Scooty driving) స్కూటీని డ్రైవ్ చేస్తూ వెళ్లాడు. అందరిలాగానే వేగంగా స్కూటీని నడుపుతున్నాడు. అయినా బీరు బాటిల్ మాత్రం అలాగే నిలబడి ఉంది. ఇలా చాలా దూరం వరకూ ఆ వ్యక్తి.. నెత్తి మీద బీరు బాటిల్‌తో ప్రయాణం చేశాడు. ఇతడి విచిత్ర విన్యాసం చూసిన వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
CC Camera Funny Video: ఇతడిది మామూలు బ్రెయిన్ కాదురా బాబోయ్.. సీసీ కెమెరాను ఎలా సెట్ చేశాడో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందు కొడితే ఇలాంటి విన్యాసాలు ఎన్నో చేయొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘బాబాయ్ విన్యాసాలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రోడ్డు పక్కన గాల్లోకి లేచిన స్కూటీ.. తీరా చివరకు చూడగా షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..