Police Viral Video: మహిళా పోలీసుకు షాక్.. విధుల్లో ఉండగా ఆమె చేసిన పనికి.. చివరకు..
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:17 PM
పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఓ మహిళకు రీల్స్ చేయడం అలవాటుగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె అనేక వీడియోలు చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలో సదరు పోలీస్‌కు సంబంధించని వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చివరకు ఏం జరిగిందంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయడం సర్వసాధారాణమైపోయింది. ఎలాంటి వృత్తుల్లో ఉన్న వారైనా.. చేసే పనితో సంబంధం లేకుండా రీల్స్ చేయడం మాత్రం పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. అలాగే మరికొందరు లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా, ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌కు వింత అనుభం ఎదురైంది. విధుల్లో ఉంటూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆమె వీడియోలు వైరల్ అవడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్ (Bihar) మోతిహారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా (Female Inspector) పని చేస్తున్న ఓ మహిళకు రీల్స్ (Reels) చేయడం అలవాటుగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు కూడా ఆమె అనేక వీడియోలు చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలో సదరు పోలీస్‌కు సంబంధించని వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
యూనిఫామ్‌లో ఉన్న ఆమె కారులో వెళ్తుండగా వీడియో చేసింది. కెమెరాకు ఫోజులు ఇస్తూ రీల్స్ చేసింది. ఇలా ఆమె తరచూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకుంది. ఇటీవల కారులో వెళ్తున్న వీడియోతో పాటూ అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. చివరకు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ (suspended) ఆదేశాలు జారీ చేశారు. ఆమె షేర్ చేసిన వీడియోలన్నింటీ పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు.
Viral Video: పాలు పొంగిపోతున్నాయా.. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఏమవుతుందో చూడండి..
విధుల్లో ఉండగా రీల్స్ చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే మరోవైపు చాలా మంది ఇన్‌స్పెక్టర్‌కు మద్దుతుగా నిలుస్తున్నారు. విధుల్లో ఉన్నా కూడా ఆమె ఎలాంటి యూనిఫామ్‌ను ఎక్కడా అవమానించలేదని, చాలా మంది పోలీసులు రీల్స్ చేస్తున్నా కూడా ఈమెపైనే చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఇన్స్‌స్పెక్టర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..