Viral Video: వీధిలో కూరగాయలు కొంటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:18 PM
వంట చేయడంలో కొందరు.. పండ్లు, కూరగాయలు విక్రయించే క్రమంలో మరికొందరు దారుణంగా వ్యవహరించడం చూస్తుంటాం. రోటీలు చేస్తూ దానిపై ఉమ్మి వేస్తూ కొందరు, కూరగాయలపై మూత్రవిసర్జన చేస్తూ మరికొందరు, పానీపూరీలో మురుగు నీరు కలిపి ఇంకొందరు.. ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ..

వంట చేయడంలో కొందరు.. పండ్లు, కూరగాయలు విక్రయించే క్రమంలో మరికొందరు దారుణంగా వ్యవహరించడం చూస్తుంటాం. రోటీలు చేస్తూ దానిపై ఉమ్మి వేస్తూ కొందరు, కూరగాయలపై మూత్రవిసర్జన చేస్తూ మరికొందరు, పానీపూరీలో మురుగు నీరు కలిపి ఇంకొందరు.. ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా కూడా.. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కూరగాయల వ్యాపారి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra, Ulhasnagar) ఉల్హాస్‌నగర్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఖేమాని ప్రాంతంలో కొందరు కూరగాయల మార్కెట్‌ను అక్రమంగా నడుపుతన్నారని తెలిసింది. ఇక్కడ ఓ వ్యాపారి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. కూరగాయలు విక్రయిస్తున్న అతను.. మధ్యలో వాటిని కడిగి శుభ్రం చేశాడు.
Viral Video: క్షణం విలువ తెలిపే వీడియో.. కారులో వెళ్తుండగా ముందు గుండెలు అదిరిపోయే సీన్..
కూరగాయలను మామూలు నీటితో కడిగి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు.. కానీ ఇతను ఏకంగా వాటిని అక్కడే ఉన్న (trader cleaning vegetables with sewage water) మురుగు కాలువలో ముంచి శుభ్రం చేశాడు. అంతటితో ఆగని అతను చివరకు మురుగు నీటిని కూరగాయలపై చల్తుతున్నాడు. ఈ విషయం తెలీని ప్రజలు ఆ కూరగాయలను కొంటూ అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు ఆ వ్యాపారి నిర్వాకం చూసి షాక్ అయ్యారు. వెంటనే వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Funny Stunt Video: బాబాయ్ బ్యాలెన్స్ మామూలుగా లేదుగా.. బీరు బాటిల్ స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియో వైరల్ అవడంతో స్థానిక ఆరోగ్యాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ వీడియో చూస్తుంటే బయట కూరగాయలు కొనాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: రోడ్డు పక్కన గాల్లోకి లేచిన స్కూటీ.. తీరా చివరకు చూడగా షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..